• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • POLITICS HEATED UP IN HUZURABAD CONSTITUENCY DURING KARIMNAGAR CM KCR VISIT TOMORROW VB KNR

CM KCR: ఆపరేషన్ హుజురాబాద్.. రంగంలోకి గులాబీ బాస్.. ఆ ప్లాన్ తో ఈటలకు చెక్..!

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫొటోస్)

CM KCR: ఈటల హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికపై ఇప్పటి నుంచి రాజకీయం వేడెక్కింది. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ పర్యటన సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు ఈటలపై విజయానికి సరి కొత్త ప్లాన్ అమలుచేస్తారని నాయకులు చెబుతున్నారు.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    ఈటల రాజేందర్ మంత్రి బర్తరఫ్ తరువాత హుజురాబాద్ నియోజకవర్గం లో రాజకీయ పరిణామాలు ఒక్కసారి గా వేడెక్కాయి. తన ఎమ్మెల్యే పదవికి, అలాగే టీఆరెఎస్ పార్టీ కి ఈటల రాజీనామా చేసిన విషయంత తెలిసిందే. వారం తరువాత బిజెపి లో కి చేరుతున్నట్లు కూడా సమాచారం కూడా ఇచ్చారు. ఈటెల బీజెపీ లోకి వెళ్తే ఈటెల ను ఎదురుకునేందుకు టీఆరెఎస్ పార్టీ బాస్ తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారని కరీంనగర్ జిల్లా నాయకులు చెపుతున్నారు. ఇందులోనే భాగంగా ఈ నేల 7 సీఎం కేసీఆర్ కరీంనగర్ వస్తున్నారని సమాచారం. ఈ సందర్భంగా మొదట కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది . అనంతరం స్థానిక వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

    గత నెలలో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే . అక్కడ కోవిడ్ పేషెంట్లతో స్వయంగా మాట్లాడిన సీఎం .. వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఇదే క్రమంలో కరీంనగర్ లోనూ పర్యటించి జిల్లాలో కరోనా బాధితుల కోసం చేపడుతున్న చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా పర్యటనలో ఆయన జిల్లాలోని కీలక నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈటల వ్యవహారంపై ఇందులో ప్రధానంగా చర్చించవచ్చు .అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ... ఆపరేషన్ హుజురాబాద్ పై గులాబీ బాస్ మరింత ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హుజురాబాద్ లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కొద్దిరోజులు హుజురాబాద్ లోనే మకాం వేసి ఈటల వర్గాన్ని బలహీనపర్చే ప్లాన్ అమలు చేశారు .

    ఉపఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా ఉండేలా గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . ఇంతవరకు కెసిఆర్ నాయకత్వం లో టీఆరెఎస్ పార్టీ కి ఎదురులేదని ఇప్పుడు ఈటల విషయంలోనూ ఇదే నిరూపితం కావాలని భావిస్తున్నారు . హుజురాబాద్ ఉపఎన్నికను ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు . కరీంనగర్ పర్యటనలో ఆపరేషన్ హుజురాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. హుజురాబాద్ ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా ... ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా పార్టీ దూసుకెళ్లేలా గులాబీ బాస్ మార్గనిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టే అవకాశం లేకపోలేదు. ఉప ఎన్నిక వచ్చే సరికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచుసుకకుంటాయో చూద్దాం..
    Published by:Veera Babu
    First published: