హోమ్ /వార్తలు /తెలంగాణ /

Delhi liquor scam: దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది! కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదు? బీజేపీ రియాక్షన్స్‌ ఇవే

Delhi liquor scam: దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది! కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదు? బీజేపీ రియాక్షన్స్‌ ఇవే

కవిత, బండి సంజయ్ (file)

కవిత, బండి సంజయ్ (file)

అందరూ అనుకుంటున్నట్లుగానే ఇవాళ కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఢిల్లీలో విచారణకు హాజరుకావలని కబురు పంపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరోపనలు ఎదుర్కొంటున్న వారందరూ ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులివ్వడం తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటను పెంచింది. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను బీజేపీ తమ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతుందంటూ ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతుంటే... మరోవైపు బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు.. కవిత కారణంగా తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. లిక్కర్ కేసు నిందితులతో తనకు పరిచయమున్నట్లు కవిత గతంలో చెప్పారని గుర్తు చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని.. సీబీఐ, ఈడీ దర్యాప్తుతో బీజేపీకి ఎలాంటి లింక్‌ లేదన్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. దొంగే దొంగ అన్నట్లు కవిత తీరు ఉందని.. దొంగ దందా చేసి తెలంగాణ సమాజానికి ఆపాదిస్తారా అంటూ కవితపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్.

ఉచ్చు బిగుస్తుందా..?

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Ramachandra Pillai)ను అరెస్ట్ చేయడంతో లిక్కర్ స్కామ్ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. తదుపరి అరెస్ట్ కల్వకుంట్ల కవితేనని బీజీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇవాళ కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఢిల్లీలో విచారణకు హాజరుకావలని కబురు పంపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరోపనలు ఎదుర్కొంటున్న వారందరూ ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కవిత కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరగుతోంది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్ట్‌పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు చేస్తోంది. ఇదంతా బీజేపీ కుట్రగా చెబుతోంది.

తెలంగాణ తల వంచదు- కవిత

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు కవిత. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ని గానీ, బీఆర్ఎస్ పార్టీని గానీ లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామన్నారు కవిత. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది తమ డిమాండ్ అని... దీని కోసం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టగా.. ఈ క్రమంలోనే మార్చి 9న(రేపు) ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందన్నారు కవిత.

First published:

Tags: CBI, Delhi liquor Scam, Kalvakuntla Kavitha

ఉత్తమ కథలు