తెలంగాణలో కరెంటు కలకలం... రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

Telangana : విద్యుత్ కొనుగోళ్ల అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 2:12 PM IST
తెలంగాణలో కరెంటు కలకలం... రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రేవంత్ రెడ్డి (File)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం కరెంటు కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిందా? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఏ ఆధారాలతో ఆయన ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడివే అంశాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో డిబేట్లకు దారితీస్తున్నాయి. తెలంగాణలో కరెంట్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నది రేవంత్ రెడ్డి డిమాండ్. కరెంటు సంస్థల్లో అక్రమాలు జరుగుతుంటే... వాటిపై ప్రశ్నించిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న తప్పుడు ఒప్పందాలపై సంతకాలు చేయని అధికారులపై కేసీఆర్ సర్కార్ వేటు వేసిందని రేవంత్ మండిపడ్డారు. సంస్థలో అనుభవం లేని, అసమర్థులైన, రిటైర్ అయిన అధికారులను తిరిగి నియమించారనే ఆరోపణలతో విరుచుకుపడ్డారు రేవంత్. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో తెలంగాణలో విద్యుత్ సంస్థలు రూ.74 వేల కోట్ల అప్పులు చేశాయన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచీ కరెంట్ కోనుగోళ్లతో అదానీతో చేతులు కలిపి లాభపడి... విద్యుత్ సంస్థలను మాత్రం కేసీఆర్ రోడ్డున పడేశారని ఆయన భగ్గుమన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బట్టీ... ఆయన... ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావును టార్గెట్ చేశారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు అబద్దాలు చెబుతున్నారనీ... ఆయన్ని గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చేయాలని అనడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యల్ని నిరసిస్తూ... కరెంటు ఉద్యోగులు నిరసన చేశారు. వారంతా ప్రభాకర్‌ రావుకు మద్దతుగా నిలిచారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ నుంచీ గన్ పార్క్ వరకు ర్యాలీ చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే... కరెంటు ఉద్యోగుల తీరును తప్పుపడుతూ... సోషల్ మీడియాలో కొన్ని స్టేట్‌మెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది.
First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading