హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad : హుజురాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. మంత్రుల పర్యటనలు..అభివృద్ది తాయిలాల మధ్య ఈటల ప్రదర్శనలు

Huzurabad : హుజురాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. మంత్రుల పర్యటనలు..అభివృద్ది తాయిలాల మధ్య ఈటల ప్రదర్శనలు

మరోవైపు రాష్ట్రంలో అనేకమంది కాలేశ్వరం బడా కాట్రక్టర్లు మంత్రి హరీష్ రావు నియోజకర్గంతో పాటు, ముఖ్యమంత్రి 

నియోజకవర్గమైన గజ్వేల్‌లో డబులు బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారని , కాని తన నియోజకవర్గంలో మాత్రం అలాంటీ 

కాంట్రాక్టర్లు లేరని అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో అనేకమంది కాలేశ్వరం బడా కాట్రక్టర్లు మంత్రి హరీష్ రావు నియోజకర్గంతో పాటు, ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌లో డబులు బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారని , కాని తన నియోజకవర్గంలో మాత్రం అలాంటీ కాంట్రాక్టర్లు లేరని అన్నారు.

Eetala Rjender : ఈటల బలప్రదర్శన , మంత్రుల పర్యటనలు , తాయిలాల ప్రకటనలు , ప్రభుత్వ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు వెరసి హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం హీట్ ఎక్కింది .దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు , రాజకీయ పార్టీలు హుజురాబాద్ పరిణామాలపై ఆసక్తిగా ఉన్నారు.

ఇంకా చదవండి ...

కరీంనగర్ జిల్లా..

న్యూస్18తెలుగు. కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

ఈటలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ , ఆత్మగౌరవం పేరుతో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఈటల రాజేందర్ లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగుతుండటంతో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి . ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత తొలిసారి గురువారం హుజురాబాద్ పర్యటనకు వచ్చారు . ఈటలకంటే ముందు ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలో పర్యటించగా ఈటల రాజేందర్ కు శివారు ప్రాంతమైన కాంట్రపల్లి వద్ద బీజేపీ కార్యకర్తలు , ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు . బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి , దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు , మాజీ ఎంఎన్ఏ ఏనుగు రవీదంర్ రెడ్డిలతో కలసి రాగ.. . ఈటల అనుచరులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు మాజీ చైర్ పర్సన్ తుల ఉమ , బీజేపీ లీగల్ సెల్ మేడ్చల్ అధ్యక్షురాలు ప్రసన్నలతో కలిసి కమలాపూర్ మండలం అంబాల , గుని పర్తి , మారన్నపేట , శనిగరం , గోపాల పురం , బత్తివానిపల్లిలలో పర్యటిం చారు .ఈటల భార్య జమునకు అడుగడుగునా మహి ళలు మంగళహారతులతో స్వాగతం పలికారు .

ఇక టీఆర్ఎస్ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది...మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ లు గత మూడు రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు . గురువారం కొప్పుల ఈశ్వర్ జమ్మి కుంటలో కార్యకర్తలతో సమావేశం కాగా , గంగుల కమలాకర్ హుజురాబాద్ లో రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొని వరల జల్లులు కురిపించారు. .ఇక రెండురోజుల్లోనే హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, పట్టణ అభివృద్ధికి ఒక్కొక మండలానికి 35కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. మరోవైపు రేషన్ డీలర్ల కమీషన్‌ కూడా విడుదల చేస్తామని స్కార్యకర్తల సమావే శాల్లో కూడ వారికి అండగా ఉంటామని , టీఆర్ఎస్ పార్టీని నమ్ముకోవాలని , పార్టీ ని వీడవద్దని హితబోధలు చేస్తూ పార్టీ క్యాడర్ ఈటల వైపు వెల్లకుండా వ్యూహా త్మకంగా ముందుకు పోతున్నారు.

టీఆర్ఎస్ నేతల వ్యూహంతో ఇప్పటికే ఐదు మండలాల్లో ఒకరిద్దరు మినహా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించారు .ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో చీలికలు రావడం , కొందరు ఈటలకు జై కొట్టడతో వారిని పిలిపించి మంతనాలు జరుపుతున్నారు . హుజురాబాద్ నియోజవర్గంలో రోజుకో మార్పు చోటు చేసుకొంటుండటం , రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Eetala rajender, Gangula kamalakar, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు