POLICE SPECIAL DRIVE AS OPARATION CHABUTRA AT MANCHIRYAL VRY ADB
Adilabad : ఆపరేషన్ చబుత్రా .. పోలీసుల అదుపులో వందలమంది యువకులు
మంచిర్యాలలో ఆపరేషన్ చబుత్రా
Adilabad : రాత్రిపూట బైక్ రైడ్లు చేస్తూ మద్యం మత్తులో రెచ్చిపోతున్న యువకులపై ఆదిలాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.. ఆర్దరాత్రి పూట స్పెషట్ డ్రైవ్ నిర్వహించి యువతను అదుపులోకి తీసుకున్నారు.
చేతికి బైక్ దొరికితే చాలూ చెవులకు రంధ్రాలు పడేలా బుర్రుమంటూ శబ్దాలు చేస్తూ చక్కర్లు కొట్టడం…. అలా చేయడం వల్ల పక్కవారికి ఇబ్బంది అవుతుందని తెలిసినా పట్టించుకోకపోవడం… పగలే కాదు రాత్రుల్లు పొరుగు వారి నిద్రకు భంగం కలిగిస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచడం పరిమాటైంది. ఇదే మని ఎవరైనా మందలిస్తే మరింత రెచ్చి పోవడం. రాత్రి దాటినా ముచ్చట్లలో మునిగి వీధుల్లో గడపడం.. నెమ్మదిగా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వంటి పనులకు పాల్పడుతున్న పోకీరీల ఆటకట్టించేందుకు పోలీసులు వినూత్నంగా ఆపరేషన్ చబుత్రా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అర్ధరాత్రి రోడ్లపై జులాయిగా తిరుగుతూ, అసాంఘీక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న యువతే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఆపరేషన్ చబుత్రా లో భాగంగా మంచిర్యాల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ తనిఖీలు కొనసాగాయి. స్పెషల్ డ్రైవ్ లో మంచిర్యాల ఏసిపి రష్మిక పెరుమాళ్, పట్టణ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ నారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ లు సిబ్బంది మొత్తం 45 మంది పాల్గొన్నారు.
యవకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందిలకు గురిచేస్తుండటమే కాకుండా, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అర్ధరాత్రి దాటినా కూడా ప్రధాన కూడళ్ల లలో రోడ్లపై వాహనాలను నిలిపి గుంపులుగా ఉన్న యువకులను, అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు సుమారు 100 మంది యువకులను అదుపులోకి తీసుకోని వారి బైక్ లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా రష్మిక పెరుమాళ్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని అన్నారు. ముఖ్యంగా యువకులు పోకిరీలుగా అవతారం ఎత్తి తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక నుండి ఈ స్పెషల్ డ్రైవ్ లు ముమ్మరంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి పది గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ, గుంపులుగా తిరుగుతూ కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. యువకులు ఇప్పటినుంచే చట్టవ్యతిరేకమైన, నేరాల్లో పాల్గొంటే భవిష్యత్ ను కోల్పోతారని సూచించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.