వాళ్లనూ ఎన్‌కౌంటర్ చేయాలి.. వరంగల్ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల డిమాండ్

తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని..వారిని కూడా కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: December 6, 2019, 2:29 PM IST
వాళ్లనూ ఎన్‌కౌంటర్ చేయాలి.. వరంగల్ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశా హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ వేళ వరంగల్ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డను చంపింది నలుగురు నిందితులని.. కానీ పోలీసులు మాత్రం ఒక్కడే అని అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని..వారిని కూడా కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు శంషాబాద్ ఎన్‌కౌంటర్‌పై వరంగల్ అత్యాచార బాధితురాలి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు

నవంబరు 27న వరంగల్ అర్బన్ జిల్లాలో యువతిపై రేప్ జరిగింది. హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల యువతిని పుట్టిన రోజు నాడే అత్యాచారం చేసి చంపారు. గుడికి వెళ్లి వస్తానని బయటకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత శవమై తేలింది. హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఆ యువతి మృతదేహం లభ్యమైంది. ఐతే ప్రియుడే ఆమెను ఇంటి నుంచి బయటికి రమ్మని అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి పడివున్న ప్రదేశంలో బీర్ సీసాలు ఉండటంతో.. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా ఆమె పేరెంట్స్ అనుమానిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఒక్కడినే అరెస్ట్ చేసి.. మిగతా వారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కూతురిని రేప్ చేసిన వారందిరినీ ఎన్‌కౌంటర్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>