Home /News /telangana /

POLICE SEARCH FOR MISSING HOUSEWIFE WITH TWO CHILDREN IN MEDAK DISTRICT SNR

Medak: ఆ ఇద్దర్నీ వెంటబెట్టుకొని వెళ్లిన వివాహిత..ఐదురోజులు గడిచినా దొరకని ఆచూకి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Medak: మెదక్ జిల్లాలో ఐదురోజుల క్రితం ఓ వివాహిత అదృశ్యమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి ఇంత వరకు తిరిగి చేరుకోలేదు. ఆమె జాడ కోసం భర్త, అత్త,మామ గాలించారు. ఆచూకి దొరక్కపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వివాహితురాలితో పాటు మరో ఇద్దరిని వెంటపెట్టుకొని వెళ్లడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ఓ వివాహిత housewifeఅదృశ్యమైంది. ఒక్కతే కాదు. పదేళ్లలోపు ఉన్న తన ఇద్దరు సంతానంతో సహా కనిపించకుండా పోయింది. కుటుంబ, భర్త, అత్తమామలు అందరూ ఉన్నారు. మెట్టినింట్లో ఉన్న మహిళ ఇద్దరు బిడ్డలతో మాయమవడం మెదక్ Medakజిల్లాలో కలకలం రేపింది. ఇది జరిగి సుమారు ఐదు రోజులు దాటిపోయింది. అయినా ఆమె జాడ దొరకలేదు. ఉందా "? లేదా ? ఎవరైనా ఎమైనా చేశారా ? లేక ఆమె ఏమైనా చేసుకుందా ? ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే వెంట తీసుకెళ్లిన పిల్లలు ఏమయ్యారు ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అటు పోలీసులకు, ఇటు కుటుంబ సభ్యులకు అంతుచిక్కడం లేదు. మెదక్ జిల్లా కొండాపూర్‌ (Kondapur)మండలం మల్కాపూర్‌(Malkapur)లో 32సంవత్సరాల(32Years old) సంతోషి(Santoshi)ఈనెల 5వ తేది నుంచి కనిపించకుండాపోయింది(Missing). ఎమ్‌ఆర్‌ఎఫ్‌ కాలనీ(MRF Colony)లో నివాసముంటున్న సంతోషి తన ఏడు సంవత్సరాల కూతురు సింధుజా(Sindhuja), ఐదేళ్ల కొడుకు నాగచైతన్య(Nagachaitanya)ను వెంటబెట్టుకొని ఇంటి నుంచి వెళ్లింది.

తల్లీ, బిడ్డలు మాయం..
వివాహిత..ఇంట్లో భర్త, అత్తమామ ఉన్నారు. ఆమె కూడా సింగల్‌గా వెళ్లలేదు. తన ఇద్దరు సంతానాన్ని తీసుకొని వెళ్లడంతో బయటకో , మార్కెట్‌కో వెళ్లిందని సంతోషి భర్త రవికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు భావించారు. 5వ తేది నాడు సాయంత్రం వరకు సంతోషి పిల్లలతో తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త రవికుమార్ ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లకు ఫోన్ చేసి ఆమె ఆచూకి కోసం వాకబు చేశారు. ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లి వెదికారు. ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. కనీసం ఎవరూ చూశామని చెప్పకపోవడంతో రవికుమార్ ఆదివారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

ఐదురోజులుగా అదృశ్యం..
వివాహితురాలు సంతోషి ఇద్దరు బిడ్డలతో కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కొండాపూర్ పోలీసులు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఎవరితో మాట్లాడింది..ఆమె ఎవరికైనా ఫోన్ చేసిందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి అదృశ్యం కావడంపై కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని..పూర్తి వివరాలు రాబడతామన్నారు కొండాపూర్ ఎస్ఐ వెంకటేశం. మెట్టినింటి వేధింపులు, అత్తమామ, భర్త ఏమైనా అంటే అలిగి ఇంటి నుంచి వెళ్లిందా అనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. ఓ వివాహితురాలు ఇద్దరు సంతానంతో మాయమై ఐదు రోజులు గడిచినప్పటికి ఆచూకి దొరక్కపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆందోళన చెందుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Medak Dist, Missing cases

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు