హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : చర్చి మహిళలను మోసిన చేసిన విలియమ్స్ రిమాండ్... గుండెపోటు కాదంటూ.. వైద్యుల నిర్ధారణ

Nalgonda : చర్చి మహిళలను మోసిన చేసిన విలియమ్స్ రిమాండ్... గుండెపోటు కాదంటూ.. వైద్యుల నిర్ధారణ

విలియమ్స్..

విలియమ్స్..

Nalgonda : నల్గొండ చర్చిలో డ్రమ్స్ వాయిస్తూ.. పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న విలియమ్స్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారుజజ. కాగా 19 మంది మహిళలను ఇలా మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

నల్గోండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్‌ వాయించే మత ప్రచారకుడు, వైద్యఆరోగ్యశాఖలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్‌ విలియమ్స్‌ పెళ్లి పేరిట యువతులను మోసగిస్తూ.. పలువురి మహిళలను తన అవసరాల కోసం వాటుకుంటున్నంటూ..ఈ క్రమంలోనే విలియమ్స్‌ తనను పెళ్లి చేసుకుంటానని సహజీవనం కూడా చేశారని.. తన వద్ద రూ.20 లక్షల నగదు తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడంటూ జిల్లా కేంద్రంలోని బీటీఎస్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పోలీసుల విచారణలో పలు ఆసక్తిర విషయాలు వెలుగు చూశాయి.. ఈ క్రమంలోనే విలియమ్స్‌ పలువురి యువతులతో సంబంధాలున్నట్లు పోలీసు విచారణలో తెలిసినట్లు సమాచారం. మత ప్రచారంతో పాటు డ్రమ్స్‌ వాయిస్తూ యువతులను తన వైపు ఆకర్శిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

అయితే ఇదే విషయమై పిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ విషయం కాస్త మీడియాలో హల్‌చల్ చేసింది. నిందితుడు మొత్తం 19 మందిని లొంగదీసుకుని పెళ్లి పేరుతో మోసం చేశాడని ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.. దీంతో యువతి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విలియమ్స్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

ఇది చదవండి : బట్టల షాపులోకే దూసుకు వచ్చిన బైకర్.. వీడియో చూస్తే.. షాక్..


అయితే పోలీసులు వస్తున్నారన్న సమచారాన్ని ముందే తెలుసుకున్న విలియమ్స్.. అరెస్ట్ కాకుండా వ్యుహాలు పన్నాడు.. తనకు గుండెపోటు వచ్చిందటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు..దీంతో ఈ విషయం కూడా బయటకు రావడంతో పోలీసులు ఆసుపత్రి వర్గాలను సంప్రదించారు. నిజంగానే గుండేపోటు వచ్చిందా.. లేక అరెస్ట్ భయంతో నాటకం ఆడుతున్నాడా అనే అంశంపై దృష్టి సారించారు.. గుండె పోటుపై అనుమానం వచ్చిన పోలీసులు విలియమ్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే విలియమ్స్‌కు ఎలాంటీ ఆనారోగ్య సమస్యలు లేవని ప్రకటించడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు..

ఇది చదవండి : ఆటో డ్రైవర్ నిజాయితీ.. మరిచిపోయిన డబ్బు బ్యాగ్ వాపస్... ఎంతంటే..


మొత్తం మీద బాధితులు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే పరిష్కరించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే నిందితుడిని గత కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేసేవారని స్థానికుల్లో చర్చ మొదలైంది. అయితే డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ విలియమ్స్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ప్రతి సారి డబ్బుల కోసమే వేధింపులకు ఆ యువతి గురి చేస్తుందని వారు తెలిపారు.

First published:

Tags: Crime, Man arrested, Nalgonda

ఉత్తమ కథలు