హోమ్ /వార్తలు /తెలంగాణ /

ద్విచక్ర వాహనాలపై కోళ్ల పందేలు చూడటానికి వెళ్లారు.. కట్ చేస్తే.. చివరకు ఇంటికి నడుచుకుంటూ వచ్చారు..

ద్విచక్ర వాహనాలపై కోళ్ల పందేలు చూడటానికి వెళ్లారు.. కట్ చేస్తే.. చివరకు ఇంటికి నడుచుకుంటూ వచ్చారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Khammam: కొంతమందికి కోడి కూయగానే నిద్ర లేస్తారు. మరికొందరు అయితే అలారమ్ మోగనిదే మెలకువ రాదు. మరికొందరేమో.. కోళ్లను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కోడి పుంజులను పెంచడానికే నిద్ర లేస్తుంటారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా కోళ్ల పందేలు కాస్తున్నారు. వారిలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

  కొంతమందికి కోడి కూయగానే నిద్ర లేస్తారు. మరికొందరు అయితే అలారమ్ మోగనిదే మెలకువ రాదు.మరికొందరేమో.. కోళ్లను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కోడి పుంజులను పెంచడానికే నిద్ర లేస్తుంటారు. కోస్తా జిల్లాల్లోని ఎక్కువగా కోళ్ల పందేలు జరుగుతుంటాయి. వీటిని ఆయా జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తుంటారు. పోలీసులు ప్రతీ సారి వాటిని నిషేదించామని చెబుతున్నా.. కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే ఇలా నిర్వహిస్తారనే విమర్శ ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా దసరా, దీపావళి పండగలకు జోరుగా కోడి పందేలను నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి, ఆంధ్రా సరిహద్దుల్లో కోడిపందాల స్థావరాలపై ములకలపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

  Minor: రాత్రి తండ్రి, పగలు కొడుకులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుటుంబసభ్యులు.. ఆ ఇంటి ఇల్లాలు కూడా..


  ఈ దాడుల్లో ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 15 కోళ్లను మరియు 46 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల సరిహద్దులతో ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఎక్కువగా ఆంధ్రా కల్చర్ ఉంటుంది. అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నారంటేనే అర్థం అవుతోంది. కోస్తా జిల్లాలో నిర్వహించే ఈ ఆచారం కాస్త సరిహద్దు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ముల్కలపల్లి-ఆంధ్రా సరిహద్దుల్లో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

  Extramarital Affair: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తెలుసుకున్న భార్య ఏం చేసిందో చూడండి..


  దీనిపై పక్కా సమాచారం రావడంతో.. పాల్వంచ సబ్ డివిజన్ ఇంచార్జ్ ఐపీఎస్ రోహిత్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ స్క్వాడ్ టీమ్స్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఘటనా స్థలంలోనే ఏడుగురుని పట్టుకొని అరెస్టే చేశారు. వారివద్ద నుంచి దాదాపు 15 వేలు నగదు, మూడు సెల్ ఫోన్లు మరియు 15 కోళ్లు, 46 బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పందేలు చూడానికి వచ్చిన వాళ్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి.. పోలీసుల రాకతో భయంతో ఇంటి బాట పట్టారు.

  Sadist: నిశ్చితార్థాన్ని అడ్డం పెట్టుకున్నాడు.. కాబోయే భార్యతో అతడు ఏం చేశాడో తెలుసా.. ముగింపు ఊహించలేరు..


  ఇలా బండి మీద వచ్చి.. కాలి నడకతో ఇంటకి చేరారు చాలామంది. పరారయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొరికిన వారిపై మాత్రం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. జిల్లా పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, డిగ్రీ కాలేజ్, గోళ్లగట్ల రోడ్డులో ఖమ్మం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి అరెస్ట్ చేశారు.

  Very Sad: పొలంలో కూలీ పనులు చేస్తున్న మహిళ.. ఏం చేస్తున్నావ్ అంటూ.. వెనుక నుంచి వచ్చిన భూ యజమాని.. ఒక్కసారిగా..


  వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువ గల 58 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సురేష్ షిండే, కవిత షిండే, సునీల్ పవార్ గా గుర్తించారు. వీళ్లు మహారాష్ట్రకు చెందిన వారుగా వెల్లడించారు. ఇలా ఎండు గంజాయిని విక్రయించేవారిని గత 10 రోజుల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

  Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


  మరో ఘటనలో ..

  చత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా సటే గుమల్నార్,వెంగనూర్ అటవీ ప్రాంతంలో డీఆర్ జీ భద్రతా బలగాలు మావోయిస్టులు సంచరిస్తున్నరనే సమాచారం తో కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ఏరియా కమిటీ మావోయిస్టు సబ్యులకు, పోలీసులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కాల్పుల్లో డీవిసియం, మల్లేష్ మృతి చెందారు.ఘటనా స్థలంలో మావోయిస్ట్ మృతదేహం, 7.62ఎం ఎం పిస్టల్, 5కిలోల ఐఇడి బాంబ్, వైర్లు, రోజువారీ మావోయిస్టులు వాడే నిత్యావసర, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్ మల్లేష్ పై 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Bhadradri kothagudem, Fighting, Hen

  ఉత్తమ కథలు