విజయారెడ్డి హత్య ఎఫెక్ట్... తహశీల్దార్‌కు పోలీసు భద్రత..

యాదగిరిగుట్ట తహశీల్దార్‌కు పోలీసు భద్రత

యాదగిరిగుట్ట ఎమ్మార్వోకు ఇద్దరు కానిస్టేబుల్స్‌తో భద్రత కల్పించారు.

  • Share this:
    ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం అనంతరం... పలు చోట్ల రెవెన్యూ అధికారులు, ఎమ్మార్వోలపై కొందరు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తమ విధులు నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి తమపై దాడి చేస్తారో అని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ కార్యాలయాల్లో పోలీసుల ప్రొటక్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యాదగిరి గుట్ట రెవెన్యూ కార్యాలయానికి పోలీస్ శాఖ ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. ఇందుకు సంబంధించి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    దీంతో పాటు రెవెన్యూ అధికారులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలు ఆర్పే పరికరాలను వెంటనే అందుబాటులో ఉంచాలని, అన్ని కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. ఇదిలా ఉంటే అధికారులకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రజల సమస్యలపై కంప్లైంట్లు తీసుకునేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఆదేశించింది. ఆ సమయంలో ఆఫీసులోని సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని కోరింది. అధికారులందరికీ రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published: