Home /News /telangana /

POLICE PERMISSION GIVEN TO BJP RALLY WHO PARTICIPATES JP NADDA VRY

BJP : జేపీ నడ్డా క్యాండిల్ ర్యాలీకి పోలీసుల అనుమతి .. శంషాబాద్‌కు చేరుకున్న నడ్డా..

జేపీ నడ్డా

జేపీ నడ్డా

BJP : ఉదయం నుండి టెన్షన్ నెలకొన్న బీజేపీ, సికింద్రాబాద్‌లో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి పోలీసులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. అయితే క్యాండిల్ ర్యాలీని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని పోలీసులు ఉన్నతాధికారులు జేపీ నడ్డాకు సూచించారు.

ఇంకా చదవండి ...
    బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతులు ఇస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.. ఆ పార్టీ నేతలు చేపట్టి క్యాండిల్ ర్యాలీని ఎలాంటీ అడ్డంకులు లేకుండా కొనసాగనుంది.అనుమతులకు సంబంధించి ఉదయం అనుమతులు లేవని చెప్పిన పోలీసులు తాజాగా ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాతో పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. ఆ తర్వాత అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ రాష్ట్ర పార్టీ పలు ఆందోళనలకు పిలుపునిచ్చింది. మొత్తం 14 రోజుల పాటు ఆందోళలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో నేటి ఉదయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో పాటు సికింద్రాబాద్‌లో సైతం శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నట్టు తెలిపారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదంటూ ఉదయం నుండి చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జనవరి 10 వరకు ఎలాంటీ ర్యాలీలకు అనుమతులు లేవని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

    కాని బీజేపీ మాత్రం ర్యాలీని ఖచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నేరుగా జేపీ నడ్డా రానున్న శంషాబాద్ కు చేరుకున్నారు. జాయింట్ సీపీ కార్తికేయ ఎయిర్‌పోర్టుకు వెళ్లి జేపీ నడ్డా పాల్గొనకుండా ప్రయత్నాలు చేశారు. కోవిడ్ నిబంధలను ఆయన వివరించారు. అయితే నడ్డా మాత్రం ర్యాలీలో పాల్గోంటానని చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తామని చెప్పారు. తమ రాజ్యంగబద్దమైన హక్కును ఎవరు అడ్డుకోలేరని జేపీ నడ్డా చెప్పారు. తాము ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తామని హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా ఆయన పాల్గొననున్న ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం.

    కాగా మరి కాసేపట్లో సికింద్రబాద్‌లోని గాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీలను బీజేపీ చేపట్టనుంది. అయితే పోలీసులకు హామి ఇచ్చినట్టు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ర్యాలీ కొనసాగిస్తారా ఒకవేళ ఎక్కువ మొత్తంలో ప్రజలు పాల్గొంటే పోలీసులు ఏం చేస్తారనేది వేచి చూడాలి..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: JP Nadda, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు