Telangana Lockdown: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. అక్కడికి తరలించి గేట్లకు తాళం వేసిన పోలీసులు.. Video

(Image-Twitter)

లాక్‌డైన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సీఎం ఆదేశాలతో శనివారం నుంచి చాలా కఠినంగా లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.

  • Share this:
    తెలంగాణలో శనివారం నుంచి పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చేవారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరకుల కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేవారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నుంచి పాస్‌లు లేకుండా రోడ్ల మీదకు వచ్చేవారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్ల మీదకు వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు ఆపి.. కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే అందులో కొందరు చెప్తున్న కారణాలు చాల సిల్లీ రీజన్స్ చెబుతున్నారు. ఆదివారం సరైన పాస్‌లు లేకుండా.. లాక్‌డైన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

    బేగంపేట పరిసరాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన పదుల సంఖ్యలో జనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోపల బంధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని పబ్లిక్ స్కూల్ ఆవరణలో వదిలిపెట్టారు. అనంతరం స్కూల్ గేట్లకు బయట నుంచి తాళం వేశారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఈ పాస్ కలిగిలేరని, సరైన కారణాన్ని చూపట్టలేదని పోలీసులు తెలిపారు.





    ‘ప్రజలు ఈ పాస్ లేకుండా, సరైన కారణం లేకుండా ఇళ్ల నుంచి బయటకు రావద్దని మేము హెచ్చరిస్తున్నాం. కానీ చాలా మంది లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వదిలేసినవారిని సాయంత్రం వరకు అక్కడే ఉండాలని చెప్పాం’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: