హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: ఆ విషయంలో అలర్టైన పోలీసులు.. డ్రోన్, సీసీ కెమెరాలతో పహారా..

Telangana News: ఆ విషయంలో అలర్టైన పోలీసులు.. డ్రోన్, సీసీ కెమెరాలతో పహారా..

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

Telangana News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. కారణం ఏంటంటే..

  (K.Lenin,News18,Adilabad)

  మావోయిస్టు పీఎల్జీఏ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. మారుమూల గ్రామాలలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.  సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా సరిహద్దులోని ప్రాణహిత, పెన్ గంగా నదీ తీర ప్రాంతాల్లోనూ నిఘా పెట్టారు. అంతరాష్ట్ర చెక్ పోస్టులు, వంతెనల వద్ద వచ్చి పోయే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నెల రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు మావోయిస్టు (PLGA) ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి నరేందర్ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులను అప్రమత్తం చేశారు.

  Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..


  కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం సమీపంలోని అంతరాష్ర్ట వంతెన వద్ద చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీలను పరిశీలించి సరిహద్దు భద్రత పై ఏసీపీ వారికి పలు సూచనలు చేశారు.  సరిహద్దులలో కొద్దిసేపు వాహనాలను తనిఖీ చేసిన ఏసీపీ వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయివేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులను విచారించారు. ఈ సందర్బంగా ఏసీపీ నరేందర్ మాట్లాడుతూ.. చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లోని ఫెర్రీ పాయింట్ లలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.


  Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


  సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, అలాగే మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో మావోల కదలికలు ఏ మాత్రం లేవని,  ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో 24 గంటల పాటు తనిఖీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

  Bigg Boss 5 Telugu Anchor Ravi Re Entry: యాంకర్ రవి రీ ఎంట్రీ..? బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన ఇదే..


  సరిహద్దులలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు  ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సరిహద్దు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలోకి కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానస్పదంగా సంచరించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Adilabad forest, Hyderabad police

  ఉత్తమ కథలు