Home /News /telangana /

POLICE HAVE UPPER HAND THAN MAOIST IN TELANGANA VRY KMM

Maoist : ప్రత్యేక రాష్ట్రంలో మావోయిస్టులపై పోలీసులే పైచేయి సాధించారా...? గణంకాలు ఏం చెబుతున్నాయి..?

maoist file photo

maoist file photo

Maoist : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులపై పోలీసులు పై చేయి సాధించారా..? గత నాలుగు సంవత్సరాల చరిత్ర చూస్తే.. మావోల కార్యకలాపాలు ఎందుకు తగ్గాయి.. దీనికి కారణం పోలీసులేనా..? ఇప్పుడు రాష్ట్రంలో మావోయిస్టుల పరిస్థితి ఎలా ఉంది..?

ఇంకా చదవండి ...
  ( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా )

  అడపా దడపా ఘటనల్లో తప్ప దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పైచేయి సాధించారని చెప్పొచ్చు. రాష్ట్రానికి పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఇప్పటికీ సమాంతర పాలనను నిర్దేశిస్తున్న మావోయిస్టులు సరిహద్దు మండలాల్లోనూ తమ ప్రభావాన్ని చూపిస్తున్న దాఖలాలున్నాయి. గత వారంలో ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచిని అపహరించిన మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి మరీ అతన్ని పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ప్రకటించారు. ఆ తర్వాత హత్య చేశారు. ఇలా అప్పుడప్పుడు అక్కడక్కడ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ మొత్తానికి చూస్తే గత నాలుగైదేళ్లుగా మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సలహాదారు కె.విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఐదు రాష్ట్రాల డీజీపీలతో తరచుగా జరిగే వ్యూహాత్మక సమావేశాలు, కేంద్ర బలగాలు సహా, వివిధ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయడం ఆయా రాష్ట్రాల్లో మంచి ఫలితాలనే ఇచ్చిందన్నది పోలీసు అధికారుల మాట. మరోవైపు గతంలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి ఎలాంటి సమన్వయం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, గ్రేహౌండ్స్‌, కోబ్రా దళాలు ఇంకా స్థానిక పోలీసులతో పాటు అన్ని రాష్ట్రాల బలగాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్న పరిస్థితి.

  KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్

  దీనికి తోడు డ్రోన్‌ కెమెరాల సాయంతో మావోయిస్టు దళాల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్షేత్ర స్థాయిలోని కూంబింగ్‌ పార్టీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం వీలయింది. వెరసి టెక్నాలజీ సాయంతో మావోయిస్టులను అదుపు చేయడంలో పోలీసులు సఫలమయ్యారు. దీనికితోడు గత రెండేళ్లుగా కోవిడ్‌-19 కరోనా రూపంలో వెంటాడుతున్న వైరస్‌ ధాటికి మావోయిస్టు టాప్‌ క్యాడర్‌ సహా దాదాపు అన్ని. స్థాయుల్లోని ఉద్యమం తీవ్రంగా ప్రభావితం అయ్యింది. సరైన వైద్య సదుపాయాలు, పౌష్టికాహారం అందక ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు, లొంగిపోయిన వారి సంఖ్య ఈ రెండేళ్లలో  బాగా పెరిగిందని చెప్పొచ్చు.

  ఇలా గత నాలుగేళ్లుగా పోలీసు రికార్డులను పరిశీలిస్తే మావోయిస్టుల హత్యలు సైతం తగ్గిపోయాయని చెప్పొచ్చు. 2018లో తెలంగాణలో ముగ్గురిని చంపేయగా, 2019లో ఇద్దరిని, 2020లో ఇద్దరిని, 2021లో ఒక్కరిని హత్య చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక హత్యయత్నాలు 2018లో రెండు, 2019లో మూడుగా నమోదయ్యాయి. పేలుళ్ల విషయానికి వస్తే 2018లో మూడు చోట్ల, 2019,2020లలో ఒకచోట చొప్పున, 2021లో రెండుచోట్ల జరిగాయి. ఇక మూకుమ్మడిగా గ్రామాల్లోకి చొరబడి గృహదహనానికి పాల్పడిన ఘటనల విషయానికి వస్తే 2019, 2020, 2021లలో ఒక్కొక్క ఘటన చొప్పున రికార్డయ్యాయి. బలవంతపు వసూళ్ల ఘటనలు సైతం గణనీయంగానే తగ్గిపోయినట్టు చెప్పొచ్చు. ఇవి 2018లో మూడు చోట్ల, 2021 లో ఒక్కచోట చోటుచేసుకున్నట్టు కేసులు నమోదయ్యాయి. ఇక తమకు అనుకూలంగా లేని వారిని బెదిరించిన ఘటనలు సైతం గణనీయంగానే తగ్గిపోయినట్టు రికార్డులు పేర్కొంటున్నాయి. 2020లో  మూడు ఘటనలు, 2021లో ఒక్కచోట ఈ కేసులు రికార్డయ్యాయి.

  crime :ఇలా కూడా ఉంటారా...? కూతురును ఎత్తుకెళ్లాడని.. మర్మాంగాలు కట్.

  ఇక ఈ ఏడాది కాలంలో 138 మంది మావోయిస్టులు రకరకాల కారణాలతో లొంగుబాట పట్టగా, మరో 112 పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్జేంజ్‌ ఆఫ్‌ ఫైర్‌ జరిగి మావోయిస్టులు చెల్లాచెదురు అయిన ఘటనల్లో పోలీసు బలగాలు సీజ్‌ చేసిన ఆయుధాలలో ఏకే-47 తుపాకులు రెండు, 9 ఎంఎం కార్బన్‌ 1, ఎస్‌ఎల్‌ఆర్‌లు 3, 303 రైఫిళ్లు మూడు, తపాంచాలు రెండు చొప్పున తెలంగాణ భూభాగంలో స్వాధీనం చేసుకున్నారు. దీనికితోడు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్న సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆర్కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్ సహా మరో సెంట్రల్‌ కమిటీ సభ్యుడు యాపా నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌లు మరణించడం  ఉద్యమానికి భారీ లోటుగా చెప్పుకోవచ్చు. దీనికితోడు రిక్రూట్‌మెంట్‌ పరంగా చూసినా మావోయిస్టులకు గత నాలుగేళ్లుగా గడ్డుకాలమే అన్నట్టుగా పరిస్థితి ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‌

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Maoists, TS Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు