Home /News /telangana /

POLICE HAVE SUGESTED TO HOUSE OWNERS WHO IS GOING TO FESTIVAL VRY

TS news : మీరు సంక్రాంతికి ఊరు వెళుతున్నారా.. అయితే మీరు ఇలా చేయాల్సిందేనంటున్నారు పోలీసులు..!

cp tarun joshi

cp tarun joshi

Warangal : మీరు సంక్రాంతికి ఊరు వెళుతున్నారా..? మీ ప్రాంతంలో దొంగల భయం పట్టుకుంటుందా.. అయితే మీరు ఇలా చేస్తే దొంగల భయం లేకుండా ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

    సంక్రాంతికి పట్టణం పూర్తిగా ఖాలీ అవుతోంది.. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన దాదాపు కుటుంబాలన్ని వెళ్లిపోతాయి.. కుటుంబ సభ్యులతో పండగ సంబరాల్లో మునిగిపోతే మరోవైపు దొంగలు సైతం తమ చేతివాటంపై దృష్టి సారిస్తారు.. పెద్ద ఎత్తున ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళుతుండడతో ఆ ఇళ్లపై నిఘా పెడుతున్న దొంగలు తమ పని కానిస్తారు. ఈ క్రమంలోనే పోలీసులు పలు సూచనలు,జాగ్రత్తలు చెబతున్నారు. ఇలా చేస్తే తమ ఇంటికి, సొమ్ముకు భద్రత ఉంటుందని చెబుతున్నారు..

    ఈ క్రమంలోనే వరంగల్ సీపీ తరుణ్‌ జోష్ పలు సూచనలు చేశారు. వాటిలో ముఖ్యంగా ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా
    ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
    విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
    మరోవైపు ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.

    బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
    గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.

    ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి.

    పని మనుషులు ఉంటే రోజూ ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలి.

    విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

    ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.

    ఇంటి డోరకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం అంటున్నారు.
    వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు.
    ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సిసి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ
    మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్ ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుందని చెప్పారు.

    Nalgonda : వీళ్లకేమైనా పిచ్చా..! ఒకడు సమాధి తవ్వితే.. మరోకడు తలను వేరు చేసి ఆలయం వద్ద పెట్టాడు..?


    పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని చెప్పారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా వరంగల్ పోలీస్ కమీషనరేట్ వాట్సాప్ నెంబర్ 9491089257 కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, TS Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు