ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు డ్రగ్స్ సరఫరా చేస్తూన్న ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నామని (drugs seized ) హైదరాబాద్ సీపీ అంజినీకుమార్ మీడియాకు తెలిపారు... నిందితుల నుండి 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా డ్రగ్‌ను మాత్రల రూపంలో అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు. నిందితుల నుంచి సుమారు 100 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఒక్కో మాత్రను వేయి రూపాయలకు కొనుగోలు చేస్తూ.. నగరంలో 2500 రూపాయలకు ఒక మాత్రను అమ్ముతున్నట్టు ఆయన వివరించారు.. ఇలా నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఒక్కో కిలోకు 40 లక్షలు ఉంటుందని తెలిపారు...కాగా డ్రగ్స్‌ను ఎవరికీ అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌లలో పెట్టి ప్యాకింగ్ చేస్తూ సప్లై చేస్తున్నారని చెప్పారు.
ఇది చదవండి : బట్ట తలపై విగ్గు పెట్టుకుని యువతుల మోసం.. భార్య ఉన్నా.. 20 మందిని చీటింగ్...
ఇలా డ్రగ్స్ విదేశాలకు సైతం అమ్ముతున్నారన్న సమాచారంతో.. బేగంపేట పోలీసులు, డీఆర్ఐ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ మత్తు టాబ్లెట్స్ కొన్ని యూప్‌ల ద్వారా కూడా విక్రయాలు చేస్తున్నారని గుర్తించామని పోలీసులు తెలిపారు. కాగా పట్టుకున్న ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చెందిన 23 సంవత్సరాల లోపు వారేనని ఆయన వెల్లడించారు.. వీరంతా డిగ్రీ , ఎంబీఏ పూర్తి చేసిన వారేనని చెప్పారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఆయన సూచన చేశారు. తమ పిల్లలు పాకెట్ మనితో ఏం చేస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారనే కోణంలో తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని ఆయన కోరారు.
ఇది చదవండి : విద్యార్థులను భయపెడుతున్న కరోనా.. నల్గొండ స్కూళ్లో పాజిటివ్
ఖమ్మంలో గంజాయి పట్టివేత
మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని JVR పార్క్ సమీపంలో చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాలీ లారీలో నిషేధిత పోడి గంజాయి తరలిస్తున్న గుర్తించి వాహనాన్ని, ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో వున్ నిందుతుడు గణేష్ ఉబాలే సూచనలతో సుమారు కోటి నాలబై రెండు లక్షల విలువ గల 566 కేజీల నిషేధిత గంజాయిని ఆంద్రప్రదేశ్, విశాఖపట్నంలో ఆటవీ ప్రాంతాలలో ట్రాలీ, లారీలోని క్రింది భాగంలో రహస్యంగా అమర్చి మారేడుమిల్లి,రాజమండ్రి , సత్తుపల్లి మీదుగా పోలీసులకు దొరకకుండా కట్టుదిట్టంగా మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ నిందుతులు పోలీస్ విచారణలో వెల్లడించారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs racket, Hyderabad