లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 1.2 లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మార్చి 22 నుంచి ఇప్పటివరకు 8320 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 1.11 లక్షల ద్విచక్ర వాహనాలు కాగా, 4881త్రిచక్ర వాహనాలు, 3390 కార్లు, మరో 539 ఇతర వాహనాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఆయా చెక్ పోస్టుల వద్ద ఈ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని భావించిన నేపథ్యంలో మరిన్ని వాహనాలు సీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వాహనాలను కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. వాహన యజమానులు లాక్డౌన్ తర్వాతే తమ వాహనాన్ని కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lockdown, Telangana, Telangana Police