• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • POLICE HAVE REGISTERED A CASE AGAINST CONDUCTED A WEDDING BARAT AND DID NOT FOLLOW THE CORONA RULES IN SANGAREDDY DISTRICT VB MDK

Telangana: పెళ్లి బరాత్ నిర్వహించారు.. పోలీసుల చేతికి చిక్కారు.. ఆ తరువాత..

పోలీసులు స్వాధీనం చేసుకున్న డీజే

Telangana: పెళ్లి అతి కొద్ది మందితో నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా రాత్రి కర్ఫ్యూ కూడా పాటించాలని తెలిపారు. కానీ ఓ పెళ్లి బృందం నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కువ మందితో రాత్రి డీజేలు పెట్టి మరీ బరాత్ నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

  • Share this:
    కరోనా వైరస్ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టినా కట్టడి కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కాకుండా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు బయటకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెడుతున్నారు. కర్ఫ్యూ ఉదంన్న ద్యాస లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది బరాత్ నిర్వహించడం అనేది జరుగుతుంది. కానీ అది కరోనా పరిస్థితులు లేనప్పడు రాత్రి బరాత్ నిర్వహించినా ఎవరూ అనే వారు కాదు. తాజాగా బరాత్ పేరుతో రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా రోడ్లపై డీజే, సౌండ్ సిస్టమ్ పెట్టి.. ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా నిర్వహిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘంచిన వీరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం ఆకుల లింగాపూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు అనే యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ప్యూ తో ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనలు పాటించకుండా రాత్రి పూట పెళ్లి బరాత్‌ నిర్వహించి ట్రాక్టర్‌పై డీజే సిస్టమ్ ఏర్పాటు చేసి సందడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కోవిడ్‌, నైట్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు.

    పోలీసులు సీజ్ చేసిన ట్రాక్టర్


    పోలీసులు స్వాధీనం చేసుకున్న సౌండ్ సిస్టమ్


    ఈ మేరకు డీజే సౌండ్‌ సిస్టం, సౌండ్‌ బాక్స్‌లను సీజ్‌ చేశారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి పరిమితికి మించి అతిథులు హాజరుకాగా ఒక్కరు కూడా భౌతికదూరం పాటించలేదు. వరుడు నర్సింహులు, అతడి తండ్రి సాయిలు, డీజే సౌండ్‌ సిస్టం యజమాని ఇటిక్యాల రవిపై కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని, పెళ్లిలో పరిమితికి మించి అతిథులు ఉండకూడదని పోలీసులు సూచించారు. అంతేకాకుండా ఈ కరోనా టైంలో ఎవరైనా DJ, బ్యాండ్ కానీ పెట్టి ఎక్కువ మంది తో బరాత్ లు తిస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసలు హెచ్చరించారు.
    Published by:Veera Babu
    First published: