Telangana: పచ్చదనం పై గొడ్డలి వేటు.. పోలీసులు ఇతడిని ఏం చేశారంటే..

చెట్లను నరుకుతున్న యువకుడు

Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఎడేండ్ల నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ కు హరిత హరం కార్యక్రమాన్ని చేపడుతూ తెలంగాణాలో ప్రణాళిక బద్ధంగా గ్రీన్ కవర్ పెంచేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశ్యాలను , గ్రీన్ కవర్ పెరగడం వల్ల కలిగే ప్రయోజనాలను పట్టించుకోకుండా చెట్లను ఇష్టారీతి గా నరికివేస్తూ కొంతమంది ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.

  • Share this:
    (కె. వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎడేండ్ల నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ కు హరిత హరం కార్యక్రమాన్ని చేపడుతూ తెలంగాణాలో ప్రణాళిక బద్ధంగా గ్రీన్ కవర్ పెంచేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశ్యాలను , గ్రీన్ కవర్ పెరగడం వల్ల కలిగే ప్రయోజనాలను పట్టించుకోకుండా చెట్లను ఇష్టారీతి గా నరికివేస్తూ కొంతమంది ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. అనుమతి లేకుండా చెట్లను నరికే వారి పై ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అయినప్పటికీ కొందరి లో మార్పు కనపడడం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొహెడ మండలం శనిగరం గ్రామ పంచాయితీ పరిధిలోని శంకర్ నగర్ ఆమ్లెట్ లో రాజీవ్ రహదారి ప్రక్కన గల సయ్యద్ మహమ్మద్ బాద్షా మోహిణిద్దీన్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ స్థలంలో మయూరి ఫ్యామిలీ దాబా నడుపుతున్నాడు.

    ఆదివారం రాజీవ్ రహదారి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో ఉన్న 7 చెట్లను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నరికేశాడు. చెట్లను నరుకుతున్న సమయంలో వీడియో లు, ఫోటోలు తీసిన ఓ అపరిచిత పౌరుడు వాటిని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి చరవాణి వాట్సాప్ కు పంపాడు. రాజీవ్ రహదారిని గ్రీన్ కారిడార్ కు చేసేందుకు ఓ వైపు శ్రమిస్తుంటే మరో వైపు రాజీవ్ రహదారి కి ఇరువైపులా హరిత హరం లో నాటిన చెట్ల ను కొందరూ ఇష్టారీతిన నరికి వేస్తున్నారంటూ ఫిర్యాదు అందించాడు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రాగానే వెంటనే స్పందించారు. కోహెడ ఎంపిడివో శ్రీధర్ తో ఫోన్లో మాట్లాడి బాధ్యుల పై చట్టపరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల తో ఎంపిడివో స్థానిక శనిగారo గ్రామ పంచాయితీ సెక్రటరీ ఎం శోభ తో కోహెడ పోలీస్ స్టేషన్ లో అనుమతి లేకుండా చెట్లను నరికేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సోమవారం ఫిర్యాదు చేశారు.

    సెక్రెటరీ ఫిర్యాదుతో పోలీస్ అధికారులు మయూరి ఫ్యామిలీ దాబా యజమానులుసయ్యద్ మహమ్మద్ బాద్షా మోహిణిద్దీన్ పై కేసు ( క్రైమ్ నెంబర్ 190/2021) నమోదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను నరికేస్తే కేసులు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా చెట్లను నరికేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గ్రీన్ కవర్ ను పెంచేందుకు ప్రజా భాగస్వామ్యం ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సదాశయం ను అర్థం చేసుకోకుంటా కొందరు చెట్లను ఇష్టారీతిన నరికి వేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో నిఘా పెట్టామని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా చెట్లను నరికే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని కలెక్టర్ పేర్కొన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్రీన్ కవర్ ను పెంచేందుకు ప్రజలందరూ తమ తోడ్పాటును అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
    Published by:Veera Babu
    First published: