హోమ్ /వార్తలు /తెలంగాణ /

Women safety: ఆటోలో మ‌హిళ‌లు ఒంట‌రిగా ప్ర‌యాణించాలంటే భయ‌మేస్తుందా..? ఇలా చేస్తే సేఫ్ అంటున్న పోలీసులు..  ‍

Women safety: ఆటోలో మ‌హిళ‌లు ఒంట‌రిగా ప్ర‌యాణించాలంటే భయ‌మేస్తుందా..? ఇలా చేస్తే సేఫ్ అంటున్న పోలీసులు..  ‍

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆటో డ్రైవర్ ముసుగులో కొందరు దోపిడీలు చేస్తుంటే.. మరికొందరు హత్యా యత్నాలకు పాల్ప‌డుతున్నారు. ఇంకొందరు గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఆటోలనే వినియోగిస్తున్నారు. ఇక మహిళలు ఒంటరిగా ఆటో కానీ, కార్లు కాని ఎక్కాలంటే భయపడే రోజులు వచ్చాయి.

ఇంకా చదవండి ...

  (న్యూస్ 18 తెలుగు ప్రతినిధి : పి మహేందర్)

  ఆటోలో ప్రయాణించాలంటే భయం.. ఆటో డ్రైవర్ ముసుగులో కొందరు దోపిడీలు చేస్తుంటే.. మరికొందరు హత్యా యత్నాలకు పాల్ప‌డుతున్నారు. ఇంకొందరు గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఆటోలనే వినియోగిస్తున్నారు. ఇక మహిళలు ఒంటరిగా ఆటో కానీ, కార్లు కాని ఎక్కాలంటే భయపడే రోజులు వచ్చాయి. ఇలా ఆటోవాలాల ముసుగులో వరుసగా వెలుగు చూసిన ఘటనలు నిజామాబాద్ పోలీసులను కలవరానికి గురిచేశాయి. దీంతో ఆటోలపై నిఘా పెట్టిన పోలీసులు.. హైదరాబాద్ తరహాలో క్యూఆర్ కోడ్  త‌ప్పనిసరి చేశారు. మై ఆటో ఇస్ సేఫ్ పేరుతో.. సరికొత్త స్టిక్కర్లు వేస్తూ.. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇస్తున్నారు.

  సుమారు 22 వేల ఆటోలు..

  నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషరేట్ పరిధిలో సుమారు 22 వేల ఆటోలు..  మరో వెయ్యి వరకు క్యాబ్ లు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటారు. గతంలో ఆటోల ముసుగులో కొందరు డ్రైవర్లు నేర ప్రవృత్తితో ప్రయాణికులను నిలువు దోపిడి చేశారు. మరికొందరు హత్యా యత్నాలకు పాల్పడ్పారు. వరుసగా వెలుగు చూసిన ఘటనలు.. పోలీస్ శాఖను కలవరానికి గురిచేశాయి. దీంతో ఆటోల్లో నేరాలను అరికట్టి.. ప్రయాణికులను భరోసా కల్పించేలా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు.

  ప్ర‌యాణం సేఫ్​..

  మై ఆటో ఈజ్ సేఫ్ (My auto is safe) పేరుతో.. ఆటోలకు క్యూ ఆర్ కోడ్ (QR code system) తప్పనిసరి చేశారు. ఆటో డ్రైవర్ల ప్రవర్తన పై ఎలాంటి అనుమానం కలిగినా.. ప్రయాణికులకు తమను తాము సేఫ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ క్యూర్ ఆర్ కొడ్ స్కాన్ (QR code system) చేయాగానే ఆటో పూర్తి వివ‌రాలు చూడ‌వ‌చ్చు. ఆ స‌మాచారాన్ని మ‌రొకరికి పంప‌వ‌చ్చు. పోలీసుల‌కు ఆ స‌మాచారాన్ని పంపితే వారు కూడా ఆటోను ట్రాక్ చేస్తారు. దీంతో ప్ర‌యాణికుల‌కు ఏలాంటి ఇబ్బంది ఉండ‌దు. వారి ప్ర‌యాణం సేఫ్​గా ఉంటుంది. పోలీసులు (Police) క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి చేయడం బాగుందని ఆటో డ్రైవర్లు సైతం అంటున్నారు. మాకు కూడా సేఫ్​ ఉంటుందన్నారు. ప్రయాణికులు స్టిక్కర్లు ఉన్నఆటోల్లో ఎక్కాలని, ఫోన్ లో స్కాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

  క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే..

  ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఆటో (Auto) డ్రైవర్లందరికి చెడ్డ పేరు వస్తోందని, ఈ కొత్త విధానం బాగుందని  ఆటో డ్రైవ‌ర్ కృష్ణ అంటున్నారు. పోలీసులు క్యూ ఆర్ కోడ్ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది.. మా ఆటోలో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మా పూర్తి వివ‌రాలు వారి చేతిలోకి వెళతాయి.. వారు నేను ఈ ఆటోలో వ‌స్తున్నానని వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించవ‌చ్చు. ఆటోలే ఏమైనా మ‌ర్చి పోయినా తిరిగి వారు మా వివ‌రాల‌తో మా ఆటోను ప‌ట్టుకోవ‌డం సుల‌భం అవుతుంద‌ని అన్నారు.

  నిజామాబాద్ (Nizamabad) ఆటోలకు క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి చేయడంతో.. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. తమ వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు పోలీసులకు సమర్పించి.. క్యూ ఆర్ కోడ్..  మై ఆటో సేప్ అనే స్టిక్కర్లను తీసుకుంటున్నారు. నిజామాబాద్ డివిజన్ కు చెందిన వారైతే వాహనానికి ఆంగ్ల అక్షరం ఎన్, నంబర్ తో క్యూ ఆర్ కోడ్ ను జారీ చేస్తున్నారు.. ఆర్మూర్ డివిజన్ వాహనానికి ఏఆర్ సిరీస్, బోధన్ డివిజన్ వారికి బీడీ సిరీస్ తో పోలీసులు కోడ్  స్టిక్కర్లు ఇస్తున్నారు. కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆటోలకు సంబధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ విధానంతో.. ప్రయాణికులకు భరోసా ఇవ్వడంతో పాటు ఆటోల ముసుగులో జరిగే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని సీపీ కేఆర్ నాగ‌రాజు చెబుతున్నారు.

  ప్ర‌యాణికులు వారి స్మార్ట్ పోన్ లో స్న‌ఫ్ తీసుకుని స్కాన్ చేస్తే ఆ ఆటోకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఉంటాయి.. ఆటోలో ఏదైన వ‌స్తువు మ‌ర్చి పోయిన పోసుల‌కు స‌మ‌చారం అందిస్తే వేంట‌నే ఆటో కు సంబంధించిన వారికి ఫోన్​ చేసి వారి వస్తువులు వారికి అందిస్తామ‌న్నారు. అయితే పోలీసులు అమలు చేస్తున్న క్యూ ఆర్ కోడ్ విధానం పై ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో చర్యలు చేపడితే.. ఫలితాలు బాగుంటాయని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Auto, Nizamabad

  ఉత్తమ కథలు