POLICE HAVE BEEN CONDUCTING AWARENESS ON NOT USE GANJA IN THE VILLAGES OF ADILABAD VRY ADB
Adilabad : యువకులు, రైతులు, గంజాయి దిశగా వెళ్లకుండా పోలీసులు ఏం చేస్తున్నారంటే... !
గంజాయి నిర్మూలకు పోలీసుల అవగహాన
Adilabad : గంజాయి నిర్మూలకు పోలీసులు వ్యుహత్మకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ,యువకులతో పాటు రైతులకు పెద్ద ఎత్తున అవగహాన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేసి ఆ దిశగా వెళ్లకుండా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది.
గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ప్రత్యేక వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, యువకులు, రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ గ్రామీణులకు గంజాయి వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ గంజాయి నిర్మూలనకు వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో సుమారు రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై వారికి అవగాహన కల్పించారు.
గంజాయి నిర్మూలకు ప్రత్యేక చట్టాలు.
ఈ సదస్సుకు తాండూరు, మాదారం, భీమిని, కన్నెపల్లి మండలాల నుండి సుమారు మూడు వేల మంది రైతులు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసిపి ఎడ్ల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్క సర్పంచ్ గంజాయి నివారణకు సహకారం అందించాలని అన్నారు. గంజాయి సాగు చేసిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి, పది సంవత్సరాలు జైలు శిక్ష విధించడమే కాకుండా వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి గంజాయి సాగు నివారణ పై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నారని, బంగారు తెలంగాణలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారి గ్రామం మొత్తం రైతు బంధు కట్ చేస్తాం అని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్క సర్పంచ్ రైతులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించి గంజాయి నివారణలో భాగస్వాములు కావాలని అన్నారు. అంతకుముందు ఏసిపి ఎడ్ల మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మాధక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో, పట్టణాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికితే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని, అలాగే పట్టా భూములలో గంజాయి దొరికితే ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్దు చేయడం జరుగుతుందని వివరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.