Home /News /telangana /

Car Driver: అతడు కారు డ్రైవర్.. తప్పు చేసి దర్జాగా తప్పించుకున్నాడు.. చివరకు పోలీసులకు ఇలా చిక్కాడు..

Car Driver: అతడు కారు డ్రైవర్.. తప్పు చేసి దర్జాగా తప్పించుకున్నాడు.. చివరకు పోలీసులకు ఇలా చిక్కాడు..

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు

Telangana News: మంచిర్యాల జిల్లా జైపూర్ లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు తో ఢీ కొట్టి ఆ వ్యక్తి మృతికి కారకుడై తప్పించుకుని తిరిగుతున్న కారు డ్రైవర్ ను కారు షోరూం డాటా ఆధారంగా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. గత ఆగస్టు నెలలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా మూడు నెలల తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  (K.Lenin,News18,Adilabad)

  మంచిర్యాల జిల్లా జైపూర్ లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు తో ఢీ కొట్టి ఆ వ్యక్తి మృతికి కారకుడై తప్పించుకుని తిరిగుతున్న కారు డ్రైవర్ ను కారు షోరూం డాటా ఆధారంగా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. గత ఆగస్టు నెలలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా మూడు నెలల తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్ కుమార్ డ్యూటి ముగించుకొని వెళుతున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీ కొని వెళ్ళడంతో రాజ్ కుమార్ మృతి చెందాడు. కారుతో ఢీకొట్టి వ్యక్తి మృతికి కారకుడై కారుతో సహా తప్పించుకొని పారిపోయిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  Read Also: వాళ్లు ఆ పని చేస్తున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. మైనర్ బాలికతో పాటు..


  అయితే జైపూర్ ఏసిపి జి. నరేందర్ ఆదేశాల మేరకు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీరాంపూర్ సీఐ బి రాజు ఆధ్వర్యంలో జైపూర్ ఎస్సై కె రామకృష్ణ తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల నుండి విచారణ కొనసాగించారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఇందులో ఇందారం ఎక్స్ రోడ్ లోని సీసీ కెమెరాల ద్వారా మారుతి బాలెనొ బ్లూ కలర్ గా గుర్తించారు, సిసీ కెమెరా పుటేజ్ లో కారు నెంబరు సరిగా కనిపించకపోవడంతో ప్రతిరోజు చుట్టుపక్కల గల అన్ని మారుతి షోరూంల నుండి డాటా తెప్పించుకొని పరిశీలించారు.

  Read Also: రాత్రి సమయంలో బాత్రూంకి వెళ్లిన యువతి.. కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూసిన తండ్రి.. తర్వాత ఏమైందంటే..


  ప్రమాదానికి కారకుడై తప్పించుకొని తిరుగుచున్న కార్ డ్రైవర్ కొడమళ్ళ విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ప్రమాదానికి కారణమైన కారు ను స్వాధీనం చేసుకొని, నిందితున్ని కోర్టులో హాజరు పరిచారు. స్వాధీనపరుచుకున్న కారును కోర్టులో జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడం లో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన జైపూర్ ఎస్సై రామకృష్ణ , పిఎస్సై శ్రీకాంత్, జైపూర్ పోలీస్ సిబ్బందిని రామగుండం కమిషనర్ , జైపూర్ ఏసీపీ అభినందించారు. తప్పు చేసి ఎవరు తప్పించుకోలేరని జైపూర్ ఏసిపి నరేందర్ పేర్కొన్నారు. చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని అన్నారు. ప్రస్తుతం అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో తప్పు చేసిన వారిని ఎలాగైనా పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.

  Read Also:  Ambulance Service: అతడు అంబులెన్స్ లను ఎలా ఉపయోగించాడో చూడండి.. వామ్మో.. ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా..


  మరో ఘటనలో..
  ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్డులోని పెట్రోక్ బంకు సమీపంలో విద్యుత్ షాక్ తగిలి ఓ రైతు మృ చెందాడు. పెట్రోల్ బంకు సమీపంలో పక్కనే చేనులో పంటను పశువుల నుండి రక్షించుకునేందుకు కంచె వైరును సరిచేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చేను పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చెందిన విద్యుత్ తీగలు కింద పడి ఉన్నాయి. రైతు కంచె వైరును సరిచేస్తుండగా ఆ వైరు విద్యుత్ తీగకు తగలడంతో షాక్ తగిలి రైతు జక్కుల గంగన్న అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్నమృతుని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.

  Read Also: భారతీయ సంగీతానికి ఎంత ఆదరణ ఉందో.. వీళ్లను చూస్తే మీకే అర్థం అవుతుంది.. వీడియో వైరల్..


  విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రోడ్డు పక్కనే ఉండటం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చెందిన తీగలు తెగి కిందపడి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ షాక్ తో మృతిచెందిన రైతు గంగన్న శవంతో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆదిలాబాద్ ఉట్నూర్ మధ్య దాదాపు అరగంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మృతిచెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం, విద్యుత్ శాఖాధికారులు ఆదుకోవాలని, పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు నాగాపూర్ సర్పంచ్ సునీల్.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Manchiryala

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు