Home /News /telangana /

POLICE HAVE ARRESTED A MAN FOR ALLEGEDLY WANDERING AROUND HOUSES IN MANCHERIAL AND RECOVERED GOLD WORTH RS 7 LAKH ADB PRV

Theft: ఇళ్ల దగ్గర అనుమానాస్పద కదలికలతో ఆగంతకుడు.. విచారిస్తే విస్తుగొలిపే నిజాలు.. వివరాలివే..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

అనుమానస్పదంగా అటూ ఇటూ తచ్చాడుతున్న సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన పద్దతిలో విచారించడంతొ ఆ దొంగ గారు కాస్తా అసలు బండారం భయటపెట్టారు.

  జల్సాలకు, దురలవాట్లకు అలవాటుపడి డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతూ చివరకు అడ్డంగా దొరికిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తునే ఉన్నాయి. ఓ వ్యక్తి జల్సాలు తీర్చుకోవడం కోసం మోటార్ బైక్ల దొంగగా మారి, దొంగలించిన బైక్ పైనే వెళుతూ చివరకు పోలీసులకు చిక్కిన సంఘటన ఇటీవల మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటుచేసుకుంది. ఇది జరిగి మూడు నాలుగు రోజులు కూడా కాలేదు అంతలోనే అదే జిల్లాలో తాజాగా మరో దొంగ (Thief) పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనుమానస్పదంగా అటూ ఇటూ తచ్చాడుతున్న సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన పద్దతిలో విచారించడంతొ ఆ దొంగ గారు కాస్తా అసలు బండారం (Theft) భయటపెట్టారు. అతని వద్దని లభించిన సొత్తును (Gold) స్వాధీనం చేసుకొని అవాక్కవడం పోలీసులవంతైంది. మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్, ఏసిపి ఎడ్ల మహేష్ ల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

  ఓ సంచిలో విలువైన బంగారు నగలు..

  మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి పట్టణ శివారులోని తాళ్ళగురిజాల పోలీసు స్టేషన్ పరిధిలో  బెల్లంపల్లి రూరల్ సి.ఐ కె. బాబురావు గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనపడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడంతో అతని వద్ద ఉన్న ఓ సంచిలో విలువైన బంగారు నగలు లభించాయి. అవి ఎక్కడివని ప్రశ్నించిన పోలీసులకు సరైన సమాధానం దొరకలేదు. దీంతో పోలీసులు తమదైన పద్దతిలో విచారించడంతో అసలు బండారం బయటపడింది. తాను చేసిన నేరాలను (Crimes) ఒప్పుకున్నాడు.

  అసలు విషయం ఏమిటంటే..

  ఖమ్మం (Khammam) జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన కొమ్మబోయిన సీతారాములు అనే యువకుడు 2009 సంవత్సరంలో అదే గ్రామంలో ఓ ఇంటి యజమాని వద్ద పని కుదుర్చుకొని పనికి వెళ్ళాడు. మొదటిసారి ఆ యజమాని ఇంట్లో పది వేల రూపాయలు దొంగతనం (Theft) చేసి పట్టుబడ్డాడు. జైలు పాలయ్యాడు కూడా. అయినా పద్దతి మార్చుకోకుండా జల్సాలు, దురలవాట్లకు అలవాడు పడి దొంగతనాలు చేస్తు ఉన్నడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో దొంగతనాలకు పాల్పడి జైలుపాలయ్యాడు. కొత్తం ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడితే ఎవరు గుర్తుపట్టరని భావించి మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఉంటూ బెల్లంపల్లి పట్టణాన్ని దొంగతనాలకు అనువుగా ఎంచుకొని బెల్లంపల్లి చుట్టు పక్క ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవాడు.

  మొదట గా బెల్లంపల్లి-1  టౌన్ ఏరియా లో రెండు దొంగతనాలు, తాళ్ళగూరిజల పోలీసు స్టేషన్ పరిధి లో రెండు దొంగతనాలు,   తాండూర్ పోలీసు స్టేషన్ పరిధి లో బంగారు, వెండి, నగదు దొంగతనలు చేశాడు. దొంగతనం చేసిన సోత్తు లో కొంత తక్కువ ధరకు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొని, వచ్చిన డబ్బుల లతో జల్సాలు తీర్చుకునేవాడు.

  మీడియా సమావేశంలో పోలీసులు


  అయితే బెల్లంపల్లి ఏరియాలో వరుస దొంగతనాలు జరుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మర్మం చేశారు. ఈ క్రమంలో నిందితుడు తాళ్ళగురిజాల సమీపంలో పట్టుబడ్డాడు. నిందితుడి  వద్ద నుండి ఏడున్నర లక్షల రూపాయల విలువగల 14 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Mancherial, Theft

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు