లాక్‌డౌన్ ఉల్లంఘన... తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 16, 2020, 4:19 PM IST
లాక్‌డౌన్ ఉల్లంఘన... తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలోని భద్రాచలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదు. ఆయనతోపాటు స్వచ్చంధ సంస్థలకు చెందిన 25 మందిపై కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో భద్రాచలం జగదీష్ కాలనీలో ఉన్న పేదలకు స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరసరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. అయితే ఇక్కడ సామాజిక దూరం పాటించడంలేదని పేర్కొంటూ లాక్ డౌన్ నిబంధనల పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు కావడాన్ని ఎమ్మెల్యే వీరయ్య ఖండించారు. స్వచ్చంధంగా సేవచేయడానికి వస్తే దాన్ని రాజకీయం చేయనవసరం లేదని వ్యాఖ్యానించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 16, 2020, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading