Home /News /telangana /

POLICE DONE FUNARALS TO COVID DEAD BODY AT JAVAHARNAGER IN HYDERABAD VRY

Hyderabad : కరోనా మృతుడికి పోలీసులు అంత్యక్రియలు... తల కొరివి పెట్టాల్సిన కొడుకుకు కరోనా..!

కరోనా మృతుడికి పోలీసులు అంత్యక్రియలు

కరోనా మృతుడికి పోలీసులు అంత్యక్రియలు

Hyderabad : ఉన్న ఒక్క కొడుకు కరోనాతో పోరాడుతుంటే, తండ్రి కరోనాతో మృతి చెందాడు..మిగతా కుటుంబ సభ్యులు లాక్డౌన్‌తో రాలేక పోయారు..దీంతో పోలీసులే కుటుంబ సభ్యుల వినతి మేరకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా ఎన్నో కుటుంబాల జీవితాలను రోడ్డున పడేయమే కాదు ..తమ వారిని కనీసం చివరి చూపుకు కూడ నోచుకోని దయనీయ స్థితిని తీసుకువచ్చింది. కరోనా సోకడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు అనేక మంది తమ ప్రాణాలకు వదులుతున్న విషయం తెలిసిందే..అయితే మృతులకు అందరు ఉన్నా.. దగ్గరికి వచ్చి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి కరోనా కల్గిస్తోంది.

ఈ నేపథ్యంలోనే చాల మంది మృతదేహాలను ప్రభుత్వ వర్గాలే ఖననం చేస్తున్న పరిస్థితి కల్గుతోంది..తాజాగా ఇలాంటీ సంఘటనలో పోలీసులు మానవత్వం చూపించారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వారి విజ్ఝప్తి మేరకు కరోనా మృత దేహానికి వారే అంత్యక్రియలు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన గున్నయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు..కూతుళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుండగా, గున్నయ్య కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోని జవహార్‌నగర్ పరిధిలో కలిసి ఉంటున్నాడు. అయితే తండ్రి కొడుకులకు వారం రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఇద్దరు గాంధీలో చేరి చికిత్స పొందుతుండగా గున్నయ్య ఈనెల 25న మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు రాని పరిస్థితి నెలకొంది. ఓ వైపు కన్న కొడుకు కరోనా చికిత్స పొందుతుండగా..ఏపీలో ఉన్న ఇద్దరు కూతుళ్లు లాక్‌డౌన్‌తో రాలేని స్థితిలో ఉన్నారు. దీంతో తండ్రి శవానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించాలని ఏపిలో ఉన్న గున్నయ్య కూతుళ్లు పోలీసులకు విజ్ఝప్తి చేశారు.

కుటుంబసభ్యుల వినతితో జవహర్ నగర్ పోలీసులు దగ్గరుండి గున్నయ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కరోనాతో మృతి చెందిన వారి దగ్గరికి కనీసం కుటుంబ సభ్యులే రాని దీన స్థితి నెలకొంది. కాని, పోలీసులు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడంతో స్థానిక ప్రజలు వారిని అభినందిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Corona deaths, Hyderabad, Telangana Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు