Hyderabad: హైదరాబాద్‌లో పోలీసుల 'న్యూ ఇయర్' ఆంక్షలు.. ఈ కీలక ప్రాంతాల్లో..

రేపు రాత్రి హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు

Hyderabad: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

  • Share this:
    హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు పోలీసులు. కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్స్‌, దుర్గం చెరువు తీగల వంతెనను మూసివేయనున్నారు. బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

    మరోవైపు డిసెంబర్ 31కి ముందు నుంచే నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాగి మద్యం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు.

    డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. ఇక రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
    ఇక హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదని తెలిపింది. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: