Home /News /telangana /

POLICE CONDUCTED A SURPRISE RAID IN KRISHNAKALANI AREA OF MANCHIRIAL DISTRICT AND SEIZED 96 BIKES AND FOUR AUTOS ADB PRV

Police raids: ఆ కాలనీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. 96 బైకులు, నాలుగు ఆటోలు సీజ్​.. అందరికీ హెచ్చరికలు జారీ చేసిన ఏసీపీ​

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

మంచిర్యాల జిల్లా శ్రీరాంఫూర్ లోని కృష్ణకాలనీ ఏరియాలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీసు కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీలను చేపట్టారు.

ఇంకా చదవండి ...
    (లెనిన్​, ఆదిలాబాద్​, న్యూస్​ 18)

    మంచిర్యాల  (Mancherial) జిల్లా శ్రీరాంఫూర్ లోని కృష్ణకాలనీ ఏరియాలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీసు కమిషనర్​ (CP) ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి (ACP) నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీలను (Police Raids) చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన  వాహన పత్రాలు  లేని 96 మోటార్ సైకిల్స్,  ఐదు ఆటోలను సీజ్ (Seized) చేశారు. అలాగే మూడు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ నరేందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కల్పించడంతోపాటు వారిలో భద్రతా భావాన్ని పెంచేందుకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే ఈ తనిఖీలను (Police Raids) నిర్వహించామని పేర్కొన్నారు. ఈ తనిఖీల ద్వారా ఎవరైన కొత్త వ్యక్తులు గాని నేరస్థులు గాని వచ్చి ఆశ్రయం పొందుతున్నారా అనే విషయం కూడా ఈ తనిఖీల ద్వారా తెలిసిపోతుందని పేర్కొన్నారు.

    చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

    ప్రజలు తమ కాలనీల్లో ఎవరైన కొత్త వ్యక్తులు కనిపించినా, అనుమానితులు సంచరిస్తున్నా దగ్గరలోని పోలీసులకు సమచారం అందించాలని సూచించారు. అలాగే కాలనీవాసులు ఏవైన సమస్యలను ఎదుర్కొంటుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రజల రక్షణ కోసం చేపడుతున్న కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే ప్రభుత్వ నిషేధిత  గుడుంబా, నిషేధిత గుట్కా ల విక్రయం, ఆన్లైన్ రమ్మీ, పేకాట ఆడినా, మద్యం (Alcohol) సేవించి వాహనాలు నడపటం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    గడువు ముగియక ముందే రెన్యూవల్​..

    వాహనాలు (vehicles) నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని,  వాహనాలకు సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదని, ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దాన్ని రెన్యూవల్​ చేయించుకోవాలని తెలిపారు.

    భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు..

    ఆన్ లైన్ మోసాల్లో ఎక్కువ శాతం చదువుకున్న వారే మోసపోతున్నారని, వీటి పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు చట్టవ్యతిరేక మైన నేరాల్లో పాల్గొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని ఏసీపీ పేరొన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రాజు , శ్రీరాంపూర్ ఎస్.ఐ మానస , జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, స్థానిక కౌన్సిలర్ బెడికె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు