హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డిపై కేసు

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డిపై కేసు

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

ఆర్టీసీ కార్మిక సంఘా జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ జేఏసీ సంఘాల కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్టీసీ డ్రైవర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టినట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్ధామరెడ్డి కారణమంటూ డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులను తప్పుదోవ పట్టించారని డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో ఆరోపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసినా అశ్వత్ధామరెడ్డి కార్మికులను ఇంకా మభ్యపెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొనట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న అశ్వత్ధామరెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో... ఈ వ్యవహారం సమ్మెపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Rtc jac, RTC Strike, Telangana Police, TSRTC Strike

    ఉత్తమ కథలు