• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • POLICE CAUGHT TWO MEN WHO ARE DOING CHAIN SNACHING IN NIZAMABAD VRY NZB

Nizamabad : స్నేహితులే దొంగలయ్యారు.. ఓ వైపు డ్రైవింగ్ మరోవైపు దోంగతనం ...!

స్నేహితులే దొంగలయ్యారు.. ఓ వైపు డ్రైవింగ్ మరోవైపు దోంగతనం ...!

Nizamabad : జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు స్నేహితులు, దోంగతనాలకు పాల్పడ్డారు..ఓవైపు తాము డ్రైవర్స్‌గానే పని చేస్తూ..జల్సాల కోసం చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు..దీంతో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు..ఇందుకోసం కావాల్సిన బైక్‌ను సైతం దొంగిలించడం కోసమెరకు

  • Share this:
నిజామాబాద్ జిల్లా,
న్యూస్18తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్,

వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు స్నేహితులైన దొంగ‌ల‌ను పోలీసులు పట్టుకున్నారు.. వారి వద్ద నుంచి సుమారు ఏడు లక్షల విలువైన సొత్త‌నును స్వాధీనం చేసుకున్నారు..
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాతో ఇటివల వ‌రుస‌గా నాలుగు గొలుసు దొంగ‌త‌నాలు జ‌రిగాయి.. దీంతో వరుస దొంగతనాలను చాలేంజ్‌గా తీసుకోని వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.. దీంతో పోలీసులు పలు వివరాలు సేకరించి పక్కా సమచారం ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు..

ఈ మేర‌కు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.. డిచ్‌పల్లి మండ‌లం దూస్‌గాం గ్రామానికి చెందిన‌ మంద సాయికుమార్, మోపాల్ మండ‌లం కంజర గ్రామానికి చెందిన అజ్జు ఆరుణ్‌లు ఇద్ద‌రు చిన్న నాటి నుంచి స్నేహితులు.. సాయి కుమార్ కారు డ్రైవ‌ర్ గా, అరుణ్ ట్రాక్ట‌ర్ డైవ‌ర్ గా ప‌నిచేస్తున్నారు.. అయితే వీరి జ‌ల్సాలకు డ‌బ్బులు స‌రిపోక పోవ‌డంతో అడ్డ దారిలో డ‌బ్బులు త్వ‌రగా సంపాదించాల‌నే అలోచన‌తో చైన్ స్నాచింగ్‌లకు పాల్ప‌డ్డారు..

ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం రాత్రి పూట వ‌న్ టౌన్ ప‌రిధిలోని ఓ హ‌స్ట‌ల్ ముందు పార్క్ చేసిన‌ పాల్స‌ర్ బైక్‌ను చోరి చేసారు.. ఆ బైక్ నెంబ‌ర్ ప్లేట్ తొల‌గించి దొంగతనాలకు పాల్పడ్డారు.. దీంతో వారం రోజుల క్రితం నిజామాబాద్ రెండో టౌన్ ప‌రిదిలోని శివాజీ న‌గ‌రంలోని ఒంట‌రిగా వస్తున్న మ‌హిళ మెడ‌లోంచి బంగారు పూస్తేల తాడును దొంగ‌లించారు.. మ‌రుసటి రోజు మరోచోట సుబాష్ న‌గ‌రలో మ‌రో గొలుసు దొంగ‌తనం చేశారు.. మ‌రో రెండు రోజుల త‌రువాత వేల్పూర్ లో ఒక‌టి, ఐద‌వ టౌన్ ప‌రిధిలో మ‌రోటి ఇలా నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ ల‌కు చేసార‌ని ఏసిపి వెళ్ల‌డించారు.. కాగా అరెస్ట్ చేసిన తర్వాత వారి వ‌ద్ద నుంచి 8.5 తూల‌ల 4 బంగారు పూస్తేల తాళ్లతోపాటు, ఒక పాల్స‌ర్ బైక్, రెండు సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు.. అయితే వీటి విలువ సుమారు ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.
Published by:yveerash yveerash
First published: