హోమ్ /వార్తలు /తెలంగాణ /

Illegal business: ఆగని రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా.. పోలీసుల అదుపులో మరో తొమ్మిది మంది..

Illegal business: ఆగని రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా.. పోలీసుల అదుపులో మరో తొమ్మిది మంది..

పట్టుబడిన రెమిడెసివిర్ ఇంజక్షన్లు, నగదు

పట్టుబడిన రెమిడెసివిర్ ఇంజక్షన్లు, నగదు

Illegal business: ఖమ్మంలో రెమిడెసివిర్ దందా ఆగడం లేదు. ఆసుపత్రి సిబ్బందే గుట్టు చప్పుకు కాకుండా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న ముగ్గురిని పట్టుకోగ తాజాగా మరో ఘటన జరగడంతో బ్లాక్ దందా విపరీతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న రెండు వేర్వేరు సంఘటనలోని తొమ్మిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ రోగులకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించాల్సిన రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను దారిమళ్ళించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న ముఠాలను కట్టడి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు రంగంలోకి దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం ఆధ్వర్యంలో సిఐ రవికుమార్ ,ఎస్సై ప్రసాద్, తమ సిబ్బందితో ఖమ్మం వన్ టౌన్ పోలీసులతో కలసి రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న నలుగురు ముఠా సభ్యులు, ఐదుగురుతో కూడిన మరో ముఠాను ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వివరాలు వెల్లడించారు. హైదరాబాదు పటాన్‌చెరువు ప్రాంతానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ హైదరాబాదులోని ESI హాస్పిటల్ చెందిన స్టాప్ నర్స్ నుండి కొనుగోలు చేసిన (06) రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఖమ్మంలోని ప్రవేట్ ఆసుపత్రి పర్యవేక్షకుడు, స్టోర్ ఇన్‌ఛార్జి మరియు ఖమ్మంకు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ సహకారంతో ఒక్కొక్క ఇంజెక్షన్ రూ. 35 వేలకు విక్రయిస్తుండగా నగరంలోని సురక్ష ఆసుపత్రి సమీపంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి 13 వేల నగదుతో పాటు ఇంజెక్షన్లు, నిందుతులను తదుపరి చట్టపరమైన చర్య నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అదేవిధంగా ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రైవేటు స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్, OT అసిస్టెంట్ డ్యూటీ డాక్టర్ (ఫార్మా-డి) అనే ఈ ఐదుగురు సమన్వయంతో ఆరోగ్య హాస్పిటల్ సమీపంలో బ్లాక్ మార్కెట్లో 03 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. 03 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, మరియు రూ .50,000 / - నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ ఆసుపత్రి రోగులకు అవసరం వుందని నమ్మించి ఆసుపత్రి యాజమాన్యం నుండి సేకరించిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క రూ. 35000 / -. విక్రయించేందుకు ప్రయత్నిచారని పోలీసుల విచారణలో నిందితులు వివరాలు వెల్లడించారని టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ రామారావు, కళింగ రెడ్డి, హమీద్ పాల్గొన్నారు.

First published:

Tags: Crime, Illegal business, Khammam, Remdesivir

ఉత్తమ కథలు