Home /News /telangana /

Matrimonial cheating : పెళ్లంటూ రెస్టారెంట్‌కు.. ఆ తర్వాత రూంకి.. కట్ చేస్తే.. ఫోటోలు ఇంటర్‌నెట్‌లో

Matrimonial cheating : పెళ్లంటూ రెస్టారెంట్‌కు.. ఆ తర్వాత రూంకి.. కట్ చేస్తే.. ఫోటోలు ఇంటర్‌నెట్‌లో

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Matrimonial cheating : సాఫ్ట్‌వేర్ కంపనీలో ఉద్యోగం ,నెలకు లక్ష రూపాయల జీతం అంటూ ఓ అమ్మాయిని ట్రాప్‌లోకి దింపాడు.. మాట్రిమోనియల్ అడ్డగా పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు.. అంతటితో ఆగకుండా వీడియోలు తీసి వాటిని ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడు..

ఇంకా చదవండి ...


    ఇటివల మాట్రిమోనియల్ మోసాలు(Matrimonial cheating) ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. ఓ వైపు మాట్రిమోనియల్‌ ప్రోఫైల్‌తో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తుంటే మరోవైపు స్థానికంగా మరికొంతమంది కూడా అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని నేరాలుకు పాల్పడుతున్నారు. ఇలా తాజాగా ఓ నిందితుడు అమ్మాయిని పెళ్లి చెసుకుంటానని మోసం చేసి శారీరకంగా కలిసిన తర్వాత డబ్బుల కోసం మోసానికి తెరతీశాడు.

    వివారాల్లోకి వెళితే.. హైదరాబాద్ (hyderabad) సరూర్‌నగర్‌కు చెందిన బాధితురాలు ఓ మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పెళ్లి కోసం నమోదు చేసుకుంది. దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలికి ఒకరు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు.మాట్రిమోనియల్‌లో తన ఫోటో చూశాను. చాలా అందంగా ఉన్నావు.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో పాటు తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని , లక్షల రూపాయల జీతం అంటూ నగరంలోని హైటెక్ సిటిలో ఉంటున్నానని చెప్పాడు. అనంతరం ఇద్దరు పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులు ఫోన్‌లో (phone chating) చాటింగ్ తోపాటు మాట్లాడుకున్నారు.  ఇలా ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకుని తనను పూర్తిగా నమ్మిన తర్వాత నిందితుడు అసలు నాటకానికి తెర లేపాడు.

     ఇది చదవండి : కేసీఆర్ అహంకారానికి.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు


    ఇలా గత ఎప్రిల్ ‌లో నేరుగా కలుద్దామని చెప్పాడు. ఇందుకోసం నగరంలోని రెస్టారెంట్‌కు (restaurant)  చేరుకుని ఇద్దరు కలిసి భోజనం (lunch) చేశారు. ఇక భోజనం తర్వాత అమెను తన రూంకి  (room) తీసుకుని వెళ్లాడు. కాబోయో భర్త కదా అని నమ్మి వెళ్లడంతో లైంగికచర్యకు (sex) పాల్పడ్డాడు..అప్పటి వరకు బాగానే ఆ తర్వాత నిందితుడు తన విశ్వరూపం చూపించాడు. ఏకంత సమయంలో ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు  (photos) తీసుకున్నాడు.. తనకు డబ్బు కావాలంటూ వేధించాడు.

    ఇది చదవండి : హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల


    వినక పోవడంతో.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో (social media) అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం కూడ బాధితురాలికి తెలియకుండా మోసం చేశాడు. తీరా ఆ ఫోటోలు బాధితురాలి స్నేహితురాలు             ( friend) చూసి చెప్పడంతో బాధితురాలు షాక్‌కు గురైంది. దీంతో నిందితుడు సుభాష్‌కు ఫోన్  (phone)  చేసింది. తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అప్పుడే ఫోటోలు తీస్తానని చెప్పాడు. దీంతో పరువు పోతుందని పోలీసులకు (police complaint) ఫిర్యాదు చేయని బాధితురాలు అడిగిన డబ్బు అందజేసింది. అయితే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా నిందితుడు రాకుండా అతన్ని స్నేహితున్ని పంపి తెలివిగా తప్పించుకున్నాడు. అయితే చెప్పినట్టగా డబ్బులు  (money) తీసుకున్నా.. ఫోటోలు మాత్రం డిలీట్ చేయకపోవడంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు