ఎప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కొమటిరెడ్డి బ్రదర్స్ పై కేసు నమోదు అయింది..సోమవారం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై స్థానిక చౌటుప్పల్ పీస్‌లో కేసు నమోదు అయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రేషన్ కార్డులను పంపిణి జరిగిన నేపథ్యంలోనే చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన పంపిణి కార్యక్రమంలో ఈ సంఘటన రాజకీయ చర్చకు దారితీసింది.
భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోంచి ఆయన మైక్ లాక్కోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడం గందరగోళానికి దారి తీసింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట జరగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈనేపథ్యంలోనే ఎమ్మార్వో గిరిధర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దళిత బంధు పథకాన్ని తమ నియోజక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు నియోజకవర్గంలోని దళితులకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే...తాను రాజీనామా చేసి సీటును టీఆర్ఎస్కు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇందుకు అనుగుణంగానే మునుగోడులో దళిత బంధు ఇవ్వాలని సుమారు పదివేల మందితో నిరసన ర్యాలీ రేపు చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఈ సంధర్బంగా తన నియోజకవర్గంలో నిరుద్యోగ చేస్తున్న వైఎస్ షర్మిల మద్దతు తెలిపిన ఆయన రేపు ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.