తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై(Bandi Sai Bhageerath) హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాను చదివే కాలేజీలో జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ.. అతడిపై దాడి చేశాడు భగీరథ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు బండి సంజయ్(Bandi Sanjay) కుమారుడు సాయి భగీరథ్ ఓ విద్యార్థిని తీవ్రంగా కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ ఘటనలో విద్యార్థి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో(Mahindra University) చోటు చేసుకుంది.
ఇదే యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ చదువుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. మరో విద్యార్థిని తీవ్రంగా కొడుతూ.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది.
విద్యార్థిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించిన బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
KCR-BRS: తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ వ్యూహమా ?
Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..మరో రూ.550.14 కోట్లు విడుదల..ఎందుకంటే?
మరోవైపు ఈ వ్యవహారంపై అటు బీజేపీ నేతలు, ఇటు బండి సంజయ్ స్పందించలేదు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయం హాట్ హాట్‌గా సాగుతున్న తరుణంలో ఈ వీడియో రాజకీయంగానూ దుమారం రేపే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay