బస్సులో అధిక ఛార్జీలు... కండక్టర్‌ను పట్టుకుని ఏం చేశారంటే...

ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.

news18-telugu
Updated: October 10, 2019, 5:10 PM IST
బస్సులో అధిక ఛార్జీలు... కండక్టర్‌ను పట్టుకుని ఏం చేశారంటే...
బస్సులో కండక్టర్లు వసూలు చేసిన ఛార్జీల వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
  • Share this:
ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నార్కట్ పల్లిలో ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే తాత్కాలిక కండక్టర్‌ను విధుల నుంచి తొలగించింది. అతడిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎస్పీ ఏవి రంగనాథ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బస్సులు లేకపోవడం... మరోవైపు తాత్కాలిక సిబ్బందితో నడుపుతున్న బస్సులు ఎటూ సరిపోకపోవడం ప్రయాణీకులకు ఇబ్బందిగా మారింది. ఇది చాలదన్నట్టుగా తాత్కాలిక డ్రైవర్లు పలు చోట్ల యాక్సిడెంట్లకు పాల్పడుతుంటే... తాత్కాలిక కండక్టర్లు తమ ఇష్టమొచ్చినట్టుగా ప్రయాణీకుల నుంచి ఛార్జీల రూపంలో డబ్బులను దండుకుంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం పోలీసులను సాయంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading