తెలంగాణలో కాంగ్రెస్ నేతల అరెస్టులు...జల దీక్షలు భగ్నం...

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి

ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు.

  • Share this:
    తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంపీ. రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ లను హౌజ్ అరెస్ట్‌ చేశారు.
    Published by:Krishna Adithya
    First published: