Home /News /telangana /

POLICE ARRESTED WHO INVOLVED IN GIRL MURDER CASE AT PANJAGUTTA IN HYDERABAD VRY

Child Murder : అక్రమ సంబంధమే..పంజాగుట్ట చిన్నారీ హత్యకు కారణమా..? చేధించిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Child Murder : పంజాగుట్టలో బాలిక హత్య చేసి రోడ్డుమీద పడేసిన కేసును పోలీసులు(Girl murder case) చేధించారు. చిన్నారి మృతదేహాన్ని వదిలివెళ్లిన మహిళను... ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    అక్రమ సంబంధమే ఆ బాలిక ప్రాణాలు తీసింది. భర్త చనిపోవడంతో మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ తల్లికి కన్న కూతురే భారం అయింది.. ఆమెకు పిల్లలు ఉండడం ఇష్టం లేని ప్రియుడితో కలిసి బాలికను దారుణంగా హింసించింది. దీంతో చనిపోయిన కూతురునే పట్టించుకోకుండా దారుణంగా రోడ్డుపై పడేసి వెళ్లిపోయింది.

    ఈ నెల 4న బాలిక మృతదేహం..

    హైదరాబాద్‌లోని పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో (Girl murder case) ఈ నెల 4న ఐదేళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో హత్యగా (Girl murder case) తేల్చిన పోలీసులు అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలతో కేసు చేధించిన పోలీసులు...బాలిక హత్యకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో... పోలీసులు ద్వారకాపురి కాలనీ సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.

    ఇది చదవండి  : 4 నెలలు కాదు..7 సంవత్సరాలుగా పెండింగ్‌.. నీటి వివాదంపై మంత్రి హరీష్ రావు.


    బాలిక మృతదేహాన్ని (Girl murder case) గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఓ మహిళ బాలికను ఎత్తుకుని ఆటో ఎక్కి ద్వారకాపురి కాలనీ సమీపంలో దిగిందని పోలీసులు తెలుసుకున్నారు. బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసిన మహిళ ఆ తర్వాత మెహదీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో తేలింది. మహిళ అక్కడి నుంచి ఎటువైపు వెళ్లిందనే వివరాలను సేకరించిన పోలీసులు... బాలిక కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

    అక్రమ సంబంధమే పాప ప్రాణాలు తీసిందా.. ?

    ఈ క్రమంలోనే పలు సీసీ కెమెరాలను (Girl murder case) పరీశిలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు పాపను వదిలి వెళ్లినట్టు గుర్తించారు.. అనంతరం ఇద్దరు కలిసి చెన్నైలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లి పట్టుకున్నారు. వీరితో ఒక బాబు సైతం ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన మహిళ... తన భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది. (Girl murder case) కూతురు విషయంలో మహిళతో ఆమె ప్రియుడు తరచూ గొడవపడేవాడు. దీంతో ఆ చిన్నారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తల్లి భావించింది. (Girl murder case) కూతురును తరచూ కొట్టడం వల్ల గాయాలతో బాలిక అనారోగ్యం పాలైంది. ఈ క్రమంలో బాలిక మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని సాయంత్రం లోపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Hyderabad, Murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు