Hyderabad : ఖాళీ స్థలానికి కాపలా కోసం ముగ్గురు మహిళలు.. అసలు యజమానికే చుక్కలు..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : ఖాళీ స్థలానికి కాపలా ఉండమన్నందుకు ఆ భూమినే కబ్జా చేశారు..స్థానికుల సహాకారంతో యజమానినే బ్లాక్ మెయిల్ చేశారు..ఆ స్థలం మాదే.. అంటూ అసలు ఓనర్‌కు చుక్కలు చూపించారు. పైగా పోలీసులకు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.

 • Share this:
  నగరంలో ఖాళీ స్థలాలు కాపాడుకోవడం గగనమే అవుతోంది..ప్రభుత్వం పకడ్భంది చర్యలు చేపట్టిన కోట్ల రూపాయల విలువ చేసే భూములపై భూకబ్జాదారుల కన్ను పడుతోంది. దీంతో నగరంలోని ఖాళీ స్థలాలపై నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అసలు యజమానులనుకు చుక్కలు చూపిస్తున్నారు.

  ఈ క్రమంలోనే బాలానగర్‌లో 1200 గజాల ప్లాటుకు ఉపేంద్రనాథ్ అనే వ్యక్తి అసలు యజమాని, అయితే ఆ స్థలం ఖాళీగా ఉండడంతో ఇతర కబ్జాదారులు చొరబడకుండా కాపలా కోసం 10 సంవత్సరాల క్రితమే.. లక్ష్మి అనే మహిళ కుటుంబాన్ని కాపలాగా పెట్టుకున్నాడు. కాగా లక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతోపాటు అక్కడే ఉంటుంది.

  అయితే గత సంవత్సరం ప్లాట్ యజమాని ఉపేంద్రనాథ్ డెవలప్‌మెంట్‌కు ఇచ్చాడు. దీంతో పనులు ప్రారంభించేందుకు వచ్చిన బిల్డర్‌ను కాపలాదారులుగా ఉన్న లక్ష్మి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆ స్థలం తమదంటూ ఎదురుతిరిగారు.ఇందుకోసం నకిలీ పత్రాలు సృష్టించారు. వాటితో యజమానిపై బెదిరింపులకు దిగారు. పైగా 100 గజాల స్థలం లేదా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాము తప్పుకుంటామని హెచ్చరించారు.

  దీంతో ఉపేంద్రనాథ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ..వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మానవ హక్కుల కమీషన్‌ను సైతం ఆశ్రయించారు. తమపై దాడి చేశారని తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తేల్చారు. కాపలాగా ఉంటూ మోసాలకు పాల్పడుతోంది. ఆ మహిళలనే అని గుర్తించారు. దీంతో లక్ష్మి ఆమె కూతుళ్లు, సరిత , సంధ్యలతోపాటు వారికి సహకరిస్తున్న స్థానిక ఆర్మీ ఉద్యోగి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరి వెనక మరో సూత్రధారి గూడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అసలు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
  Published by:yveerash yveerash
  First published: