Home /News /telangana /

Hyderabad : గచ్చిబౌలి దొంగలను పట్టుకున్న పోలీసులు.. 70 లక్షల సొమ్ము రికవరి..

Hyderabad : గచ్చిబౌలి దొంగలను పట్టుకున్న పోలీసులు.. 70 లక్షల సొమ్ము రికవరి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Hyderabad : పక్కా ప్లాన్‌తో ఇంటి ఓనర్‌కే కన్నం వేసి బంగారం నగదు మాయం చేసిన నేపాల్ వాచ్‌మెన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 7 లక్షల రూపాయలతో పాటు కిలోకి పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    ఇటీవల గచ్చిబౌలి(gachibowli) టెలికాం నగర్‌లో నివాసం ఉంటున్న గోవిందరావ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సైబారాబాద్(cyberabad) పోలీసులు చేధించారు.. నిందితులకు సంబంధించి సైబారాబాద్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.. గత వారం రోజుల క్రితం దొంగతనానికి (theft)పాల్పడ్డ నిందితులు నేపాల్‌కు చెందిన లంక బహదూర్ సాహి అతని భార్య పవిత్రగా గుర్తించారు. వీరిని సోలాపూర్(solapur) రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ (arrest)చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి ఏడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

    కాగా నిందితులు నగరంలోని గత ఐదు నెలల క్రితం గోవింద రావ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఆపై ఇద్దరు చాలా నమ్మకంగా యజమానితో వ్యవహరించారు. ఈ నెల 18న గోవింద రావు అతని ఫ్రెండ్‌తో కలిసి శ్రీశైలంకు వెళ్లగా ఆ సమయంలో అతని ఇంట్లో దొంగతనం జరిగింది. గోవింద్ రావ్ ఈ నెల 19న శ్రీశైలం(srishailam) నుంచి తిరిగి వచ్చే సరికి అక్కడ దొంగతనం జరగడం వీటితో పాటు పని వాళ్లు కనపడకపోవడంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

     ఇది చదవండి  :రెండు రోజుల్లో పెళ్లి, అమ్మాయితో పాటు మధ్యవర్తి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది..కారణం ఇదే..


    దీంతో నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా ఎట్టకేలకు ఇద్దరిని పక్కా సమాచారం ప్రకారం సోలాపూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నేరుగా నేపాల్‌కు వెళ్లకుండా సోలాపూర్ లో కొంతకాలం ఉండి ఆపై నేపాల్ (nepal)వెళ్లాలని వారు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యమ్లాల్ అనే వ్యక్తి ఈ నిందితులిద్దరిని గోవింద్ దగ్గర పనికి కుదిర్చినట్టు తెలిపారు. యమ్లాల్ అనే వ్యక్తి పాత్రపై కూడా విచారణ చేస్తున్నట్లు, అతను నేపాల్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    ఇది చదవండి : హైదరాబాద్ నగరంలో వర్షాలు.. మరో రెండు రోజుల పాటు ఎఫెక్ట్


    కాగా ఈ కేసు సంచలనంగా మారింది. నమ్మకానికి మారుపేరుగా ఉండే నేపాలీలు ఇలాంటీ దొంగతనానికి పాల్పడడంతో పోలీసులు దృష్టి సారించారు. దీంతో పలు ఇళ్లలో సెక్యూరిటీ గార్డులుగా పని చేసే నేపాలీలపై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Hyderabad police, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు