Remdesivir : రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత ,గ్యాంగ్ అరెస్ట్

అక్రమంగా విక్రయిస్తున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను పట్టుకున్న పోలీసులు

Remdesivir ఖమ్మంలో రెమ్‌డెసివిర్ అక్రమ దందాలకు చెక్ పేట్టేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బ‌ృందం మరో ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

  • Share this:
ఖమ్మంలో రెమ్‌డెసివిర్ అక్రమ దందాలకు చెక్ పేట్టేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బ‌ృందం మరో ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల హైదరాబాదు నుంచి అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం , ఎస్సై ప్రసాద్, తమ సిబ్బందితో ఖమ్మం సరిహద్దు నాయకన్ గూడెం వద్ద నిఘా పెట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఐదు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను పట్టుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వివరాలు వెల్లడించారు.

పధకం ప్రకారం ఒక్కొ ఇంజక్షన్ 32 వేలకు కొవిడ్ బాధితులకు విక్రయించేందుకు ఘట్కేసర్ మండలం నారపల్లి గ్రామానికి చెందిన నల్లెదా తిరుమల్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో వున్న మెడికల్ షాప్‌లో ఐదు రెమ్‌డెసివిర్ వైల్స్ ను తీసుకొని ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రి పిఆర్వో‌గా పనిచేస్తున్న అకారాపు నిరంజన్‌కు ఖమ్మం సరిహద్దులో అప్పగించేందుకు AP10 BG 1113 నెంబరు గల తన కారులో హైదరాబాదు నుండి బయలుదేరి ఖమ్మం సరిహద్దుకు చేరుకున్నారు. నిరంజన్‌కు ఇంజక్షన్లను అప్పగిస్తున్న సమయంలో దాడిచేసి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.కరోనా రోగుల అత్యవసర వైద్యం కోసం వాడే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాను కట్టడి చేసేందుకు దృష్టి సారించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు రంగంలోకి దింపి దిశానిర్దేశం చేయడంతో ఇప్పటికే పలు ముఠాలను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published by:yveerash yveerash
First published: