హోమ్ /వార్తలు /తెలంగాణ /

దొంగబాబా క్షుద్రపూజలు.. అనుచరులతో మహిళల నగ్నఫొటోల కోసం యత్నాలు

దొంగబాబా క్షుద్రపూజలు.. అనుచరులతో మహిళల నగ్నఫొటోల కోసం యత్నాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్షుద్రపూజలు చేసేవాళ్లు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఓ దొంగబాబా చేస్తున్న క్షుద్రపూజలకు పోలీసులు బ్రేక్ చేశారు. ఏం జరిగిందో తెలుసుకుందాం. (సయ్యద్ రఫీ - న్యూస్18తెలుగు)

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ.. మహబూబ్ నగర్ జిల్లా.. జడ్చర్లలోని పాత బజారుకు చెందిన ఇద్దరు వ్యక్తులు... రంగారెడ్డి జిల్లా.. ఆమనగల్లుకు చెందిన మరో వ్యక్తి... కలిసి.. హైదరాబాద్‌లోని ఓ దొంగబాబా కోసం పనిచేస్తున్నారు. ఆ దొంగ బాబా క్షుద్రపూజలు చేస్తున్నాడు. జడ్చర్లకు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లి... హైదరాబాదులోని స్వామీజీని దర్శించుకుంటే అమ్మవారు అవహించేలా చేస్తారని చెప్పారు. తద్వారా జాతకం మారిపోయి ధనవంతులు అవుతారనీ.. కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మించారు. దాంతో తాను ఏం చెయ్యాలో చెప్పాలని ఆ మహిళ కోరింది.

"మీ శరీల కొలతలు.. అమ్మవారికి సెట్ అవుతాయో లేదో తెలియాలి. కాబట్టి.. మీ శరీర ఆకృతి కొలతలు కావాలి. అలాగే నగ్న ఫొటోలు కావాలి" అని ఆమెకు సంబంధించిన కొన్ని నగ్న ఫొటోలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరి.. అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన వివరాలతో.. హైదరాబాద్‌లోని అసలు నిందితుడైన దొంగ బాబా కోసం గాలిస్తున్నారు.

ప్రధాన నిందితుడిని పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయనీ.. ఆ దిశగా ప్రత్యేక బృందంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా నకిలీ స్వామీజీలు, నకిలీ బాబాలను నమ్మవద్దనీ, అమాయకంగా మోసపోవద్దని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Mahabubnagar, Telangana News

ఉత్తమ కథలు