పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బల్లి.. అసలేం జరిగిందంటే..

Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచి చూశారు. కానీ అందులో డబ్బు ఎక్కడికి పోలేదు. అక్కడంతా మాములుగానే ఉంది. కానీ సైరన్ ఏలా మోగిందనే విషయం తెలుసుకుని పోలీసులు, స్థానికులు ఖంగుతిన్నారు.

  • Share this:
    ఓ బల్లి ఏకంగా పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. అదెలా అంటారా.. అవునండీ అది నిజమే. అసలే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ విధులతో పోలీసులు ఊపిరిసలపకుండా ఉన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది సికింద్రాబాద్‌లోని చిలకలగూడ. సమయం అర్ధరాత్రి. ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలోని సైరన్ మోగింది. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు ఏటీఎంలో దొంగలు పడ్డారనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచి చూశారు. కానీ అందులో డబ్బు ఎక్కడికి పోలేదు. అక్కడంతా మాములుగానే ఉంది. కానీ సైరన్ ఏలా మోగిందనే విషయం తెలుసుకుని పోలీసులు, స్థానికులు ఖంగుతిన్నారు. ఏటీఎం లోపల ఉన్న సైరన్ పైకి బల్లి పాకడంతో అలారం మోగినట్టు గుర్తించారు. లాక్‌డౌన్ సమయంలో బల్లి చేసిన పనికి అందరూ కొద్దిసేపు నవ్వుకున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: