టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) స్పందించారు. ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి, శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం అని పోచారం శ్రీనివాస్ (Pocharam Srinivas Reddy) అన్నారు. ఇలా చేయడానికి మనకు ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇవ్వలేదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. చావనైనా చస్తాం కానీ పార్టీని మాత్రం వీడే ప్రసక్తే లేదని పోచారం తేల్చి చెప్పారు. నేడు అంబెడ్కర్ వర్ధంతి సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో నివాళులు అర్పించిన పోచారం (Pocharam Srinivas Reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు విషయాలు పక్కన బెడుతున్నాం..
రాజకీయాల్లో ఆలోచించేవాడే పాలన చేయగలుగుతాడు. రోజు రాజకీయాల గురించి మాట్లాడుతూ అసలు విషయాలు పక్కన బెడుతున్నామని పోచారం అభిప్రాయపడ్డారు. అయితే ప్రతి రోజు రాజకీయాలు చేయడం పాదయాత్రల పేరుతో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారే అధికారంలోకి వస్తారు. ప్రజల మన్ననలు ఉన్న వారే అధికారం చేపడతారని అన్నారు. నేను స్పీకర్ గా ఉన్నా కాబట్టే కొంత పరిధిమేర మాట్లాడుతున్న అని పోచారం శ్రీనివాస్ అన్నారు. తాను పాదయాత్రలు తప్పు పట్టడం. మీరు ప్రజలకు ఏమి చేస్తారో చెప్పుకోండి. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తుంది. కానీ ప్రభుత్వాలను కొల్లగొట్టడం, ప్రభుత్వాన్ని కూల్చేయడం, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం సరికాదన్నారు. ప్రజలు అలా చేయడానికి మనకు ఓట్లు వేయలేదు. ఇది కాదు ప్రజాస్వామ్యం అని అన్నారు.
Breaking News: వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్..ఆ ఘటనపై ఆరా..ఢిల్లీకి రావాలని సూచన
నా నియోజకవర్గం పేరు వినిపించింది..అందుకే గుర్తు చేస్తున్న..
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి అనేక మాటలు వినిపిస్తున్నాయి. అందులో నా నియోజకవర్గం పేరు కూడా వినిపించింది. కాబట్టి గుర్తు చేస్తున్న..చావనైనా చస్తాం కానీ పార్టీని మాత్రం వీడే పని చేయమని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి పోవాలని అనుకోవడం లేదు. ఇంత మంచి ప్రభుత్వాన్ని వదులుకోమని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
నేను 47 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న. అనేక ముఖ్యమంత్రులను చూశా. మంత్రిగా కూడా పని చేశా. ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ కూడా డబ్బులకు అమ్ముడుపోయేవారు కాదు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గ్రామ స్థాయికి తీసుకెళ్లేలా చూస్తున్నాం. అయితే ప్రభుత్వాన్ని కూల్చుతాం అని చేసే చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. చేతులెత్తి మొక్కుతున్న అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేద్దాం అని పోచారం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Pocharam Srinivas Reddy, Telangana, TRS MLAs Poaching Case