కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి దక్కిందని బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modi) ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైల్వే శాఖ ప్రకటించిన కొత్త ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ రైల్వే ప్రాజెక్టు ఏంటి? ఆ రైల్వే ప్రాజెక్టు ఎక్కడ వస్తుంది? అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి నిరాశే ఎదురైందని విమర్శిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ (Pm Narendra Modi) ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఈ ట్వీట్ లో ఏముందంటే 'తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణ ప్రజలకు అభినందనలు' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైల్వే లైన్ల విద్యుద్దీకరణలో భాగంగా..పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుద్దీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
More power to this Mission and congratulations to the people from Karnataka, Maharashtra and Telangana who will benefit from this particular stretch. https://t.co/AUpHTszu6Q
— Narendra Modi (@narendramodi) February 3, 2023
పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పలు కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని పలు సంస్థలకు కేటాయించిన నిధులను కేంద్ర మంత్రి వెల్లడించారు. సింగరేణి, గిరిజన యూనివర్సిటీలు, మణుగూరు కర్మాగారాలకు నిధులు కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి.
సింగరేణికి రూ.1600 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్ల కేటాయింపు
మణుగూరు, కోటభారజల కర్మాగారాలకు రూ.1437 కోట్ల కేటాయింపు
హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్ల కేటాయింపు
అలాగే బీబీ నగర్ ఎయిమ్స్ కు కూడా నిధుల కేటాయింపు జరిగింది.
సాలార్ జంగ్ సహా పలు మ్యూజియాలు అభివృద్ధికి రూ.357 కోట్ల కేటాయింపులు జరిగాయి.
ఇక తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ తో మరో కొత్త ప్రాజెక్టు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Narendra modi, Telangana