Home /News /telangana /

PM NARENDRA MODI TO VISIT HYDERABAD ON 26TH MAY SECURITY BEEFED UP IN ISB WITH 2000 POLICE PERSONNEL SK

PM Narendra Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ఐఎస్బీలో 2వేల మంది పోలీసులు..

ప్రధాని మోదీ (Image : PTI)

ప్రధాని మోదీ (Image : PTI)

PM Narendra Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఐఎస్‌బీ వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మోదీ రాక సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌ (PM Narendra Modi Hyderabad Tour)లో పర్యటించనన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ద్విదశాబ్ది వార్షికోత్సవంతో పాటు స్నాతకోత్సవంలో (ISB Hyderabad Anniversary)  ఆయన పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గచ్చిబౌలికి వెళ్లి.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(HCU) ప్రాంగణంలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐఎస్పీబీకి చేరుకుంటారు. ప్రధాని మోదీ (PM Modi ISB Visit) రాక సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్బీలోనే 2వేల మంది పోలీసులను సెక్యూరిటీ ఉంచారు. బుధవారం నుంచే ఐఎస్పీ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఇన్ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

    మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి.. 2014 ముందు ఇలా ఉండేది కాదన్న బీరేన్ సింగ్..

    ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ధి వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లకు చెందిన దాదాపు 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఆ విద్యార్థులనా పోలీసులు నిఘా ఉంచారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్షికోత్సవంలో పాల్గొబోయే విద్యార్థుల సామాజిక మాధ్యమాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లయితే.. వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్న సమాచారం. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతలు మీదుగా పట్టాలు అందుకే పది మంది విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేజిపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ముందుగానే వారికి వివరించారట. ఐఎస్బీ సిబ్బంది పూర్వాపరాలను కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలిలించి..కన్‌ఫమ్‌ చేసుకుంటున్నారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే.. స్టేజిపైకి వెళ్లాల్సిన వారిని ఫైనల్ చేశారు. అవసరమైతే రేపటి నాటికి మార్పులు చేర్పులు కూడా చేయవచ్చు.

    భారత్‌ను అర్థిస్తున్నా.. గోధుమల ఎగుమతి నిషేధం నిర్ణయాన్ని భారత్ పునరాలోచించుకోవాలన్న IMF చ

    సాధారణంగా ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే.. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం పలుకుతారు. కానీ రేపు సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండడం లేదు. ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్తుండడంతో.. ప్రధాని కార్యక్రామానికి హాజరుకావడం లేదు. సీఎం స్థానంలో సీఎస్ సోమేశ్ కుమార్ బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలకున్నట్లు తెలుస్తోంది. ఐతే సీఎం కేసీఆర్ కావాలనే బెంగళూరుకు వెళ్తున్నారని.. ప్రధాని మోదీ అంటే ఆయనకు భయమని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మోదీ నగరానికి వచ్చినప్పుడల్లా కావాలనే డుమ్మాకొడుతున్నారని.. గతంలో సమతా విగ్రహావిష్కరణ సమయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు.

    Rahul Gandhi : తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ

    మరోవైపు హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇది పార్టీ కార్యక్రమం కానప్పటికీ.. ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు బేగంపేటకు వెళ్తారని.. అక్కడే వారితో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు మాట్లాడతారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతంపై ప్రధాని మోదీకి బండి సంజయ్ వివరిస్తారని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా పర్యటనల తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటిస్తుండడంతో.. ఈ టూర్ పార్టీలో మరింత జోష్ తీసుకొస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Hyderabad, PM Narendra Modi, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు