PM Narendra Modi: తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే...

ప్రధాని నరేంద్ర మోదీ (File Image)

Statue of equality: రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని త్రిదండి చినజీయర్‌స్వామి ఆహ్వానించారు. మైహోమ్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రం అందజేశారు.

 • Share this:
  రామానుజాచార్యులు.. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు. దళితులను, దీనులను మంత్రోపదేశంతో తరింపజేసి వైష్ణవులుగా తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత. ఆకాలంలోనే ఏకవర్గ పాలనను పక్కనబెట్టి పాలనాధికారాలను అన్ని వర్గాలకు అనుగ్రహించిన సమతా మూర్తి. అంతటి ఈ మహనీయులు అవతరించి వెయ్యేండ్లు గడిచింది. ఈ క్రమంలోనే ఆ సమతామూర్తికి కృతజ్ఞతగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి 216 అడుగుల సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో విగ్రహం రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకూ సహస్రాబ్ది మహోత్సవాల పేరిట ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా శనివారం ప్రధాని మోదీని ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.

  రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని త్రిదండి చినజీయర్‌స్వామి ఆహ్వానించారు. మైహోమ్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రం అందజేశారు. కుల, వర్గ బంధనాలను తెంచి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్యాత్మిక విష్ణవమూర్తి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటిచెప్పడానికే 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానికి వివరించారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్‌స్వామి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రామానుజాచార్యుల పంచలోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.

  Hyderabad kitex : తెలంగాణలో కిటెక్స్.. ఎంఓయూ .. 40 వేల మందికి ఉపాధి..  Huzurabad : అక్కడ ప్రతిరోజు పండగే.. 100 కోట్ల మద్యం జాతర.. కారణం ఇదే..!

  అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, శ్రీరామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.

  Ktr : డ్రగ్స్‌పై నేను ఏ టెస్టుకైనా సిద్దం.. రాహుల్ గాంధీ శాంపిల్స్ ఇస్తాడా.. ?

  శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో రామానుజచార్యు అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరగనున్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. దీనిని సుమారు 5వేల మంది రుత్విక్కులు నడిపిస్తారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. అంతేకాదు ఆయా దివ్య దేశాల నుంచి తెచ్చిన శ్రీ సాలగ్రామమూర్తి, దివ్య మృత్తికా సన్నిధులలో చేర్చి 108 దివ్య దేశాల ప్రాణప్రతిష్ట జరుగుతుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: