PM MODI : సీఎం కెసీఆర్‌కు ప్రధాని మోడి కితాబు..కెసిఆర్ ఆలోచనలు అమలు చేస్తామని హామీ

PM MODI : సీఎం కెసీఆర్‌కు ప్రధాని మోడి కితాబు..కెసిఆర్ ఆలోచనలు అమలు చేస్తామని హామీ

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

pm modi : సిఎం కెసిఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్ లో మాట్లాడారు. కరోనా నేపథ్యంలోనే పలు సూచనలు, సలహాలు సీఎం కేసీఆర్ ఇచ్చారు..దీంతో సీఎం కేసీఆర్ సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని ,ఆయన ఆలోచనలు, సూచనలు బాగున్నాయని మోడి చెప్పారు.

  • Share this:
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కెసిఆర్. అయితే ప్రస్తుత పరిస్థితులపై కేంద్రమంత్రి హర్షవర్థన్‌తో పోన్లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అయితే సీఎం కేసిఆర్‌తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ వెంటనే స్పందించారు.

సమీక్షా సమావేశానంతరం సిఎం కెసిఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్ లో మాట్లాడారు. సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలనుకేంద్ర మంత్రి హర్షవర్దన్ తనకు వివరించారని ప్రధాని సిఎంకు తెలిపారు. ‘‘ మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ ’ అంటూ ప్రధాని సిఎం కెసిఆర్ ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ ప్రధానికి ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. సిఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సిఎం కు హామీ ఇచ్చినట్టు తెలిపారు.

అంతకుముందు సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 50 వేల తాత్కలిక ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు పలు ఆదిలాబాద్, వరంగల్ సూపర్ స్పేషాలిటి ఆసుపత్రులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండు నెలల పాటు తెల్ల రేషన్ కార్డు దారలుకు ఒక్కరికి ఆదనంగా అయిదు కిలోల చొప్పున ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మరో 80 మందికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. కాగా  గత నెల నుండే వారికి రెండు వేల రూపాయలతో పాటు 25 కిలోల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: