(శ్రీనివాస్. పి న్యూస్ 18తెలుగు ప్రతినిధి, కరీంనగర్ జిల్లా)
ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన (PM Narendra Modi Ramagundam Tour)కు సర్వం సిద్ధమైంది. రామగుండం ఎరువుల కర్మాగా రం (RFCL), భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు రూ.9500 కోట్ల రూపాయ లకు పైగా విలువ కలిగిన పలు ప్రాజెక్టులకు రామగుండం లో శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన తర్వాత.. బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడతారు. ఇందుకోసం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సభా ప్రాంగణం ముస్తాబైంది. వారం రోజులుగా ఎన్టీపీసీ పర్మినెంటు టౌన్ షిప్ ని మైదానంలో మూడు సభా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీ , వీఐపీలతో పాటు సాధారణ ప్రజలు కూర్చునేలా కుర్చీలు సిద్ధం చేశారు. టౌన్‌షిప్‌తో పాటు రాజీవ్ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందం వేదిక వద్ద తనిఖీలు చేపట్టింది. నిఘా కెమెరాలతో పాటు ప్రజలు వీక్షించేందుకు భారీ తెరలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌లో ప్రతి కదలికను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు .
Ramagundam: మరికొన్ని గంటల్లో ప్రధాని పర్యటన..RFCLలో సాంకేతిక సమస్యలు..అధికారుల్లో టెన్ష
మరోవైపు ప్రధాని మోదీ పర్యటపై స్థానిక ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తారని భావిస్తున్నారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ డిస్పెన్సరీ మాత్రమే ఉండగా, 100 పడకల ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసింది. కానీ భూ సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టే విధంగా ప్రధాని చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ట్రిపల్ ఐటీ ఏర్పాటు చేయాలనే ప్రతి పాదన ఉంది. ఈ ట్రిపుల్ ఐటీ కరీంనగర్ జిల్లాకు రావలసి ఉంది. జిల్లాకు రావలసిన లేదర్ పార్కు, సైనిక్ స్కూలు తరలిపోయాయన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.
ఉడాన్ 5.0 ప్రాజెక్టులో భాగంగా వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బసంతనగర్‌లో మినీ ఎయిర్ పోర్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఉన్న విమానాశ్రయం స్థలంతో పాటు అదనంగా మరో 60 ఎకరాల వరకు భూములను సేకరించాల్సి ఉంది. సత్వరమే నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటీకరణలో భాగంగా.. కోయగూడెం , సత్తుపల్లిలో గల ఓసీపీ -3, మందమర్రిలో గల శ్రావణపల్లి, కెకె -6 గనులకు టెండర్లు పిలిచారు. దీనిపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం కేంద్రంగా హామీ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. అంతేకాదు
కోల్ కారిడార్ను కలిపేందుకు 2006 లో ప్రతిపాదించిన రామగుండం- మణు గూర్ రైల్వేలైను పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఇప్పటికే పలు కార్మిక సంఘాలు గో బ్యాక్ అంటూ నిరసన బాటపట్టాయి. రామగుండం బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణి బావుల ప్రైవేటీకరణపై మండిపడుతున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు, వామపక్షాలు స్పష్టం చేయడంతో.. రామగుండం చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.