PM NARENDRA MODI HYDERABAD TOUR PM MODI SLAMS CM KCR AND TRS PARTY IN BEGUMPET WELCOME MEETING SK
PM Narendra Modi: కుటుంబ పార్టీలను తరిమేయాలి.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi Hyderabad Tour: హైరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుదని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పర్యటన (PM Modi Hyderabad Tour)లో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)ను టార్గెట్ చేసుకున్నారు ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీనేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో మాట్లాడిన ఆయన.. పరోక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై (PM Modi comments on cm kcr) విరుచుకుపడ్డారు. కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని చురకలంటించారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. తాను ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని అన్నారు. పట్టుదల, పౌరుషానికి తెలంగాణ మారు పేరని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి ఖచ్చితంగా జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటడవం ఖాయమని స్పష్టం చేశారు.
''నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చిన అపూర్వ స్వాగతం పలికారు. పట్టుదల, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నా నివాళులు. ఉద్యమంలో వేలాది మంది మరణించారు. నిరంకుశ పాలనలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదు. ప్రజలు కలలు సాకారం కాడం లేదు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది. కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కుటుంబ పార్టీలు ప్రజస్వామ్యానికి, దేశ యువతకు అతి పెద్ద శత్రువులుగా మారాయి. కుటుంబ పార్టీ వల్ల ఎంతగా అవినీతి జరుగుతుందో దేశ ప్రజలు చూశారు. కుటుంబ పార్టీను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవాళ్లు నాడూ ఉన్నారు. నేడూ ఉన్నారు. యువతతో కలిసి తెలంగాణను మేం ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాం.'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Telangana| 'Pariwarwaadi' party is not just a political problem but the biggest enemy of the democracy and the youth of our country. Our country has seen how corruption becomes the face of those political parties dedicated to one family: PM Modi addresses BJP workers in Hyderabad pic.twitter.com/C0dQfY7VVt
''కుటుంబ పార్టీలు కేవలం వారి సొంత అభివృద్ధి కోసమే ఆలోచిస్తాయి. పేదల ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవు. కేవలం ఒక్క కుటుంబమే అధికారంలో ఎలా ఉండాలి? ప్రజలను ఎలా దోచుకోవాలి? అనే దానిపైనే వారి దృష్టి ఉంటుంది. అంతేతప్ప ప్రజల అభివృద్ధి గురించి అస్సలు ఆలోచించరు. ఇలాంటి కుటుంబ పార్టీలను తరిమిస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కేంద్ర పథకాల పేరు మార్చి తెలంగాణ ప్రజలను ఏమారుస్తున్నారు. '' అని ప్రధాని మోదీ అన్నారు.
'Pariwarwaadi' parties only think about their own development. These parties do not care about the poor people, their politics is focused on how a single-family can stay in power and loot as much as they can. They do not have any interest in the development of people: PM Modi pic.twitter.com/NEZzWAg1xk
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముగ్గురు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. తాము పారిపోయే వారం కాదని.. పోరాడేవారమని స్పష్టం చేశారు. కంప్యూటర్ యుగంలోనూ కొందరు మూఢమ్మకాలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు తెలంగాణకు న్యాయం చేయలేరని విమర్శించారు ప్రధాని మోదీ.
కాగా, బేగంపేటలో ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, లక్ష్మణ్, రాంచంద్రరావు, విజయశాంతి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. బేగంపేటలో సభ ముగిసిన అనంతరం.. ప్రత్యేక హెలికాప్టర్లో గచ్చిబౌలికి వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఐఎస్బీకి ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఐఎస్పీ వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.