ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ (PM Modi Hyderabad Tour)లో పర్యటిస్తారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో..హైదరాబాద్ (Hyderabad) లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్బీ ఈవెంట్లో హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లకు చెందిన దాదాపు 930 మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. ఆ విద్యార్థులై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క ఐఎస్బీ ప్రాంగణంలోనే రెండు వేల మంది పోలీసులను మోహరించారు. ప్రధాని హాజరుకానున్న ఐఎస్బీ స్నాతకోత్సవానికి పాస్‌లు ఉంటేనే అనుమతిస్తారు.
ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. బేగంపేట నుంచి ఐఎస్బీకి వెళ్లే మార్గంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవలే ప్రధానిగా నరేంద్ర మోదీ 8 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో.. అపూర్వంగా స్వాగతం పలకనున్నారు. మోదీకి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల కోసం మొత్తం ఆరుసెట్ల నాయకుల లైనప్‌లను రూపొందించినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), డీకే అరుణ (DK Arun), డా.కె.లక్ష్మణ్ (K.Laxman), టి.రాజాసింగ్ (Raja singh) ..ప్రధాని మోదీని కలిసే అవకాశముంది. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక బేగంపేట నుంచి హెచ్సీయూకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్లో మోదీ వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లనున్నారు.
TS|BJP: కరీంనగర్ ఏక్తాయాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..రాష్ట్ర బీజేపీ చీఫ్ ఏమన్నారంటే
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీ మేయర్ ఆయనకు స్వాగతం పలుకుతారు.
అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 1:50 గంటలకు హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి.. 2 గంటల సమయంలో ఐఎస్బీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 3:15 గంటల వరకు ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అంతేకాదు తన చేతుల మీదుగా కొందరు విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు.
3:20 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకుంటారు. తిరిగి ఐఎస్బీ నుంచి బయలుదేరి ... 3:30కు హెచ్సీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బేగంపేటకు వెళ్తారు. 3:55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి పయనమవుతారు.
మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం నింపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే బీజేపీ ముఖ్య నేతలు పర్యటించడంతో నయా జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే జేపీ నడ్డా,అమిత్ షాతెలంగాణలో పర్యటించారు. తాజాగా మోదీ కూడా వస్తుండడంతో.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి వీరి పర్యటనలు దోహదపడతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ బెంగళూరుకు పర్యటనకు వెళ్లడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎంకి ముఖం చెల్లకే.. బెంగుళూరు పర్యటన పేరుతో తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.