హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: 'కూర్చో నితీష్.. కాసేపు ఆగండి'.. సీఎం కేసీఆర్ వీడియోపై బీజేపీ ట్రోలింగ్

CM KCR: 'కూర్చో నితీష్.. కాసేపు ఆగండి'.. సీఎం కేసీఆర్ వీడియోపై బీజేపీ ట్రోలింగ్

తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్

తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్

CM KCR: కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలోనే నితీష్ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నితీష్‌కు ఇదే ప్రశ్న చాలా సార్లు ఎదురయింది. తాజాగా మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురవడంతో ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) బుధవారం బీహార్ రాజధాని పట్నాలో పర్యటించిన విషయం తెలసిందే. గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలతో పాటు హైదరాబాద్‌ (Hyderabad) టింబర్ డిపోలో జరిగిన మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం నితీష్ కుమార్‌ (Bihar CM Nitish Kumar)తో తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే కేసీఆర్ కలగజేసుకొని.. కూర్చోండి నితీష్ జీ.. విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ ట్రోలింగ్ చేస్తోంది. కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది.


ప్రెస్ మీట్ ఆఖరులో ఓ విలేఖరి ఆసక్తికరమైన ప్రశ్నను సీఎం కేసీఆర్‌కు సంధించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మంత్రి అభ్యర్థిగా నితిష్‌కుమార్ పేరును మీరు ప్రతిపాదిస్తారా? అని అడిగారు. దానిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ''నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి నేనెవరిని? ఒకవేళ నేను ప్రతిపాదించినా కొందరు వ్యతిరేకించవచ్చు. అందరం కూర్చుకొని మాట్లాడతాం.'' అని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలోనే నితీష్ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నితీష్‌కు ఇదే ప్రశ్న చాలా సార్లు ఎదురయింది. తాజాగా మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురవడంతో ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కేసీఆర్ విజ్ఞప్తితో మళ్లీ కూర్చుకున్నారు నితీష్ కుమార్. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. అప్పుడే బీజేపీని గద్దె దింపగలమని కేసీఆర్ అన్నారు.

ఈ వీడియోపై బీజేపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. పరువు తీసుకోవడానికే పట్నాకు కేసీఆర్ వెళ్లారని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పూర్తయ్యే వరకు కూర్చోవాలన్న కనీస మర్యాద కూడా నితీష్ ఇవ్వలేదని విమర్శించారు.అటు బీహార్‌కు చెందిన బీహార్ నేత, రాజ్యసభ సభ్యులు సుశీల్ మోదీ.. సీఎం కేసీఆర్, నితీష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని అభ్యర్థిగా నితీష్‌ కుమార్‌ని కేసీఆర్ కూడా అంగీకరించలేదని.. ఆయన ముందే తిరస్కరించారని అన్నారు. సీఎం కేసీఆర్ పదే పదే ఆయన్ను కూర్చోమన్నప్పటికీ.. నితీష్ కుమార్ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ''వీరిద్దరు పగటి కలలు కంటున్నారు. ముందు 2023 ఎన్నికల్లో కేసీఆర్ తన సీఎం సీటును కాపాడుకోవాలి. 2024లో వీరిద్దరు సీఎం పదవుల్లో ఉండరు. తమ సీట్లను తాము కాపాడుకోలేని వారు.. ప్రధాని అవుతామంటూ కలలు కంటున్నారు.'' అని సెటర్లు వేశారు సుశీల్ మోదీ.కాగా, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే విపక్ష నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సోరెన్‌తో చర్చలు జరిపారు. నిన్న బీహార్‌కు వెళ్లి ఇదే విషయంపై నితీష్ కుమార్‌తో చర్చించారు.

First published:

Tags: Bihar, CM KCR, Nitish Kumar, Trs

ఉత్తమ కథలు